Thursday, November 7, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Balotsav 2023 - Organized by VVIT...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Balotsav 2023 – Organized by VVIT – Active Participation of Schools – Instructions Issued

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

GOVERNMENT OF ANDHRA PRADESH

SCHOOL EDUCATION DEPARTMENT

Memo.No.ESE02-30/74/2023-A&I -CSE Date: 21/11/2023

Sub:School Education – Cultural festival will be organized VVIT Balotsav2023 – Request for wide publicity and encourage the schools for their active participation – Certain instructions issued – Reg

Ref: Lr.dt: 18.11.2023 of the Principal of Vasireddy Venkatadri Institute Technology (VVIT).

&&&

While enclosing herewith a copy of the reference cited along with its enclosures, all the District Educational Officers in the state are instructed to give wide publicity and to advise all schools to ensure participation in VVIT BALOTSAV-2023 held from 11th December to 13th December 2023 as requested in the above reference.

balotsav 2023 - organized by vvit - active participation of schools - instructions issued

బాలోత్సవ్ 2023 – 20 అంశాలు 61 విభాగాలు

పోటీలు నిర్దేశించిన వేదికలపై నిర్వహించబడును. ప్రతి విభాగంలోను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మరియు 2 ప్రత్యేక బహుమతులు ఇవ్వబడును. 

వి.వి.ఐ.టి. బాలోత్సవ్-2023లో పాల్గొన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక ప్రశంసాపత్రం ఇవ్వబడును.

balotsav 2023 - organized by vvit - active participation of schools - instructions issued

పోటీలు నిర్వహించు శాస్త్ర మరియు సాంస్కృతికాంశాలు

1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్ / డిజిటల్ స్పాట్ డ్రాయింగ్)

2. వక్తృత్వం (ఇంగ్లీషు – తెలుగు)

3. తెలుగు పద్యం

4. సంస్కృత శ్లోకం

5. శాస్త్రీయ సంగీతం

6. శాస్త్రీయ నృత్యం (కూచిపూడి/భరతనాట్యం) (సోలో/గ్రూపు)

7. తెలుగులోనే మాట్లాడుదాం

8. వేషధారణ (సంప్రదాయ / విచిత్ర)

9. రచన (కవిత, కథ, లేఖ)

10. అభినయం (ఏకపాత్రాభినయం / మూకాభినయం)

11. జనరల్ క్విజ్

12. విశ్లేషణ (కథావిశ్లేషణ, లఘుచిత్ర విశ్లేషణ)

13. మట్టితో బొమ్మలు చేద్దాం

14. నాటికలు

15. (Spell Bee)

16. వాద్య సంగీతం (రాగ, తాళ ప్రధానం)

17. జానపద నృత్యం (సోలో/గ్రూపు)

18. కథ చెబుతా, వింటారా ?

19. లలిత / జానపద గీతాలు

20. శాస్త్ర సాంకేతిక అంశం (ప్రయోగశాల, ప్రదర్శనశాల)

balotsav 2023 - organized by vvit - active participation of schools - instructions issued

పోటీలకు ప్రవేశ రుసుము లేదు.

* ఇతర జిల్లాలు – రాష్ట్రాల నుండి వచ్చువారికి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యం కలదు.

అర్హత విభాగము : 

*సబ్ జూనియర్స్ నర్సరీ నుండి 4వ తరగతి వరకు

* జూనియర్స్ – 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు సీనియర్స్ 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు

నియమ నిబంధనలు :

1. ప్రపంచంలో ఏదేశంలో నివసిస్తున్న తెలుగు విద్యార్థులు వివిఐటి బాలోత్సవ్- 2023 పోటీలలో పాల్గొనుటకు అర్హులు.

2. ప్రతి విద్యార్థి తాము చదువుచున్న పాఠశాల నుండి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. స్కూల్ యూనిఫారంలో పోటీలలో పాల్గొనరాదు.

3. పోటీలలో పాల్గొను వారు న్యాయనిర్ణేతలకు తమ పేరు, పాఠశాల పేరు చెప్పరాదు.

4. వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా “కోడ్ నెంబర్లు” ఇవ్వబడును.

5. పోటీదారులు తాము పాల్గొనే అంశాలను ధ్రువీకరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి అనుమతి పొందిన పత్రం జతపరచాలి.

6. పోటీలకు కేటాయించిన కాలపరిమితిలోనే అంశాలను పూర్తిచేయాలి. అదనపు సమయం తీసుకున్నచో అనర్హతగా భావించబడుతుంది.

7. ఒక విద్యార్థి ఒకే సమయంలో రెండు మూడు పోటీలలో పాల్గొనరాదు. ఒకే రోజు వేరువేరు సమయాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చు.

. 8 జానపద నృత్యాలు ప్రదర్శించేవారు వైవిధ్యభరితమైనవి, అశ్లీలత లేనివాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అశ్లీల నృత్యప్రదర్శనలను నిషేధించే అధికారం న్యాయనిర్ణేతలకు ఉంది.

9. వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా “కోడ్ నెంబర్లు” 11-12-2023 ఉదయం గం|| 8.30 ని॥ నుండి ఆయా ప్రత్యేక కౌంటర్లలో యివ్వబడతాయి.

10. విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదములకు తావులేదు. ఏ రోజు పోటీల విజేతల వివరాలు ఆరోజే ప్రకటించబడును.

11. కార్యక్రమము సజావుగా జరుగుటకు అప్పటికప్పుడు కొత్త నియమనిబంధనలను ఏర్పరిచే అధికారం న్యాయనిర్ణేతలకు కలదు. వాటిని పోటీదారులు అంగీకరించవలెను. సమయానుకూలంగా కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు చేయుటకు మరియు రద్దు చేయుటకు నిర్వాహకులకు అధికారం కలదు.

12. రిజిస్ట్రేషన్ కొరకు www.balotsav.in/registration వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారాలను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపవచ్చు, లేదా అదే వెబ్ సైట్ గూగుల్ ఫారం (https://forms.gle/66Zy5HwwdwErYpyn8) పూర్తిచేసి సబ్మిట్ (submit) మీట నొక్కటం ద్వారా అప్లోడ్ చేయవచ్చు.

13. పూర్తి చేసిన తమ విద్యార్థుల ఎంట్రీఫారంలను పాఠశాలల యాజమాన్యాలు 02-12-2023 లోపు చేరేలా మాకు పంపాలి.

14. స్పాట్ ఎంట్రీలు అనుమతించబడవు.

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు అవసరమైన శాస్త్ర సాంకేతిక విషయాలపై ఉపాధ్యాయులకు కార్యశాల నిర్వహించబడును. కార్యశాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సర్టిఫికెట్, పాఠశాలకు ఉపయోగకరమైన సైన్స్ కిట్ అందించబడును.

Download VVIT Balotsav Entry Form

Download VVIT Balotsav Brochure

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this