ఫోన్ ను కొన్న కొత్తలో బాగా ఫాస్ట్ గా ఉంటుంది.. వాడుతున్న కొద్ది అది స్లో అవుతుంది.. కొన్ని యాప్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువగా స్టోరేజ్ అయిపోవడం వల్ల కూడా ఫోన్ చాలా స్లో అవుతుంది.. ఇక ఫోన్ ను వాడాలంటే చిరాగ్గా కూడా ఉంటుంది.. అలాంటి వారి కోసం అద్భుతమైన టిప్స్.. ఈ టిప్స్ ను ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి..
మాములుగా ఫోన్‌లో తక్కువ మెమొరీ ఉండటం, తక్కువ స్టోరేజీ ఉండటం వల్ల స్లో అవుతుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసినా ఫోన్ స్లో అవుతుంది. ఇవన్నీ కాకుండా మరో ముఖ్యమైన కారణం వల్ల కూడా ఫోన్ స్లో అవుతుంటుంది..
ఇంటర్నెట్ ను ఎక్కువగా వాటడం వల్ల క్యాచి డేటా పెరిగిపోతుంది. అప్పుడు కూడా ఫోన్ స్లో అవుతుంది..అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి.. అందుకోసం మీ ఫోన్ ఫాస్ట్‌గా పనిచేయాలని అనుకుంటే.. అందులో యాప్స్‌కు సంబంధించిన క్యాచేను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. ఇందుకోసం మీ ఫోన్‌లో తొలుత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసి.. యాప్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో మీరు ఏ యాప్ కాష్ క్లియర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.. క్యాచి డేటాను క్లియర్ చెయ్యండి..
ఫోన్ ర్యామ్ 4 లేదా 6 జీబీగా ఉండి.. ఒకవేళ క్యాచేను క్లియర్ చేయకపోతే ర్యామ్ ప్రాసెసింగ్ స్లో అవుతుంది. ఫలితంగా ఫోన్ స్లోగా నడుస్తుంది. మీరు ఎప్పటికప్పుడు ఈ క్యాచేలను క్లియర్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటే.. ది బెస్ట్ ప్రాసెసర్ ఉన్న ఫోన్‌ను కొనండి.. ఆ ఫోన్లే ఎక్కువగా స్లో అవ్వకుండా ఉంటాయి..