New Plant Species In Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మొక్కను కనుగొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) కు చెందిన పరిశోధకులు ఈ మొక్కను గుర్తించారు. పాపుమ్ పారే జిల్లాలోని ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో ‘అకాంతేసి, ఫ్లోగాకాంతస్’ అనే కుటుంబానికి చెందిన కొత్త రకం మొక్కలు ఉన్నాయని, వీటికి భారతీయ హిమాలయ ప్రాంతంలో మొక్కలు, పర్యావరణ పరిశోధనలకు ముఖ్యమైన సహకారం అందించినందుకు బీఎస్ఐ శాస్త్రవేత్త డాక్టర్ సుధాన్సు శేఖర్ దాస్ పేరుతో ‘ఫ్లొగాకాంతస్ సుధాన్సుశేఖరి’గా నామకరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్ లో ఫ్లొగాకాంతస్ అనే మొక్క మొత్తం 13 రకాలను కలిగి ఉంది. ప్రధానంగా ఇది ఈశాన్య, తూర్పు హిమాలయ రాష్ట్రాల్లో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. కొత్త జాతులపై వివరణాత్మక పరిశోధన పత్రాన్ని రచయితలు సామ్రాట్ గోస్వామి, రోహన్ మైతీ ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫారెస్ట్రీలో ప్రచురించారు. తాజా పరిణామంపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ట్విటర్ వేదికగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ జీవవైవిధ్యం విస్తృతమైంది, వైవిధ్యమైంది. కొత్త వృక్షజాలం అన్వేషణలతోపాటు బీఎస్ఐ పరిశోధకులు ఇటానగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫ్లోగాకాంతస్ సుధాన్సుశేఖరి అనే కొత్త వృక్ష జాతులను గుర్తించారని కొనియాడారు. ఈ ఆవిష్కరణ మన సుసంపన్నమైన సహజ వారసత్వాన్ని, భవిష్యత్తు తరాలకు దానిని సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం చెప్పారు.
The biodiversity of Arunachal Pradesh is wide & varied.
In an addition to the findings of new flora, researchers from @bsi_moefcc have identified a new plant species, named Phlogacanthus sudhansusekharii, in the Itanagar Wildlife Sanctuary.
This discovery reminds us of our… pic.twitter.com/ncX54ZmkhZ
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) July 18, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.