ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలుగుతుండడతో భారత్‌లో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ఎయిర్వేస్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో చిన్న సమస్య వచ్చిందని అన్నారు. దీంతో ప్రధానంగా అమెరికాలో సమస్య అధికంగా వస్తుందని చెప్పారు. ఇదే విషయమై తమ కార్యదర్శితో మాట్లాడానని తెలిపారు. మన దేశంలో టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టం నుంచి మాన్యువల్ సిస్టంలోకి మూవ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో దానికి సంబంధించి సమస్య ఏదీ లేదని తెలిపారు.
ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాన్యువల్ పద్ధతులలో ఆపరేషన్స్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఎయిర్ లైన్స్, అథారిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో పని చేస్తూ ప్రయాణికులకు సేవలందించాలని అన్నారు. విమానాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన ప్రయాణికులకు సీట్లు, ఆహారం, నీరు అందించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ మెరుగుపరచాలని తెలిపారు. ప్రయాణికుల సేవకు అదనపు సిబ్బందిని ఉపయోగించాలని చెప్పారు. మైక్రోసాఫ్ట్ నిపుణులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖ విమానాశ్రయంలో..
విశాఖలో విమానాల ఆపరేషన్‌లో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. మాన్యువల్‌గా బోర్డింగ్ క్లియర్ చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో జాప్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీ బాగా పెరిగింది.
#Update on the Global #Microsoft cloud outage. pic.twitter.com/9SNJA1yJWA
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) July 19, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.