Janasena Leader NagaBabu : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్టణం, పార్వతీపురం మన్యం, ఉమ్మడి విజయనగరం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీనికితోడు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వరదనీటిలో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు.. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని జనసేన నాయకులు, కార్యకర్తలను నాగబాబు కోరారు. తాగునీరు, ఔషదాలు, ఆహారం అందించాలని సూచించారు.
మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించడంలోనూ తోడ్పాటు ఇవ్వాలని జనసేన నేతలు, కార్యకర్తలకు నాగబాబు విజ్ఞప్తి చేశారు.
వరద సహాయక చర్యల్లో అధికారులకు సహకరించండి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు pic.twitter.com/k5fV9rlYAn
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.