డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. రోజు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ సేవిస్తున్న బడా పారిశ్రామిక వేత్తలను గుర్తించారు పోలీసులు. ఏడు పబ్‌లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్, సిస్టల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని మధురాజుతోపాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులో A14గా హీరోయిన్.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్‌ని చేర్చారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ…. కన్జుమర్లను చార్జ్‌షీట్‌లో పెడతామన్నారు. మరోసారి నిందితుల శాంపిల్స్ తీసుకున్నామని చెప్పారు.
అమన్‌తో పాటు పాజిటివ్ వచ్చినవారికి నోటీసులిచ్చామని చెప్పారు. అమన్‌ను హైదరాబాద్‌లోనే పట్టుకున్నామని, పాజిటివ్ వచ్చినవారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, DPS 27 ప్రకారం కన్జుమర్లు కూడా నిందితులని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కొటిక్ బ్యూరో, ఎస్‌వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. ఈకేసులో ఐదుగురు నిందితులను డ్రగ్స్ పెడ్లర్లుగా తేల్చారు నార్సింగి పోలీసులు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం.. ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ ఐదుగురు నిందితులకు 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
అయితే డ్రగ్స్ కేసులో A1గా నైజీరియన్ మహిళ అనోహా బ్లెస్సింగ్ గా గుర్తించిన పోలీసులు.. మొత్తం 18 మందిపై కేసు నమోదుచేశారు. వీరిపై సెక్షన్ 22(C), 27(A)తో పాటు .. Ndpc యాక్ట్ 27 కింద కేసు నమోదు చేశారు. ఇక డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎబుకా సుజి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.