Muchumarri Girl Incident : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై(9ఏళ్ల బాలికపై హత్యాచారం) నంద్యాల ఎస్పీ అదిరాజ్ కీలక విషయాలు వెల్లడించారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసి చంపేశారని తెలిపారు. ఆ తర్వాత భయంతో బాలిక గొంతు నులిమి చంపేశారని, మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేశారని చెప్పారు. అనంతరం ఈ విషయాన్ని బాలురు తమ కుటుంబసభ్యులకు చెప్పారని పేర్కొన్నారు. తమ పిల్లలు దొరక్కుండా ఉండేందుకు, వారిని కాపాడుకునేందుకు మళ్లీ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి, రాళ్లు కట్టి కృష్ణా నదిలో పడేశారని ఎస్పీ తెలిపారు. బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
”జూలై 7న బాలిక ఆడుకోవడానికి వెళ్లింది. ముగ్గురు మైనర్ బాలురు బాలికను తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి బాలికను చంపి కేసీ కెనాల్ ఒడ్డున పడేశారు. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు చెప్పారు. తమ పిల్లలు దొరికిపోతారనే భయంతో కుటుంబీకులు బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి పుట్టిలో తీసుకెళ్లి కృష్ణా నదిలో పడేశారు. దర్యాఫ్తులో మైనర్ బాలురు నేరాన్ని ఒప్పుకున్నారు. మైనర్లను జువైనల్ కోర్టుకు, మేజర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తాం.
బాలిక మృతదేహం కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ కేసులో కుటుంబసభ్యుల పాత్ర ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? మొబైల్ లో ఏం చూస్తున్నారు? ఇది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు దారి తప్పారంటే వెంటనే వారి తల్లిదండ్రులకు చెప్పాలి. మనకెందుకు అనుకుంటే తప్పు చేసిన వారు అవుతారు” అని నంద్యాల ఎస్పీ అన్నారు.
కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో 9ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా బాలిక మృతదేహం లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 7న బాలిక కనిపించకుండా పోయింది. బాలికపై అత్యాచారం, హత్య చేసి కాలువలో పడేశామని నిందితులైన ముగ్గురు మైనర్ బాలురు 9వ తేదీన చెప్పారు. అప్పటి నుంచి డెడ్ బాడీ కోసం గాలిస్తూనే ఉన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.