ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ అద్భుతమే చేశాడు. ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదనే కోపంతోనో ఏమో.. బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 10 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టాడు. అందులో నాలుగు వికెట్లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా సాధించాడు. లబుషేన్ సాధించిన ఈ ఫీట్ చూసి.. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం షాక్ అయింది. అయితే.. ఈ అద్బుతమైన బౌలింగ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం కార్డిఫ్ వేదికగా గ్లామోర్గాన్ వర్సెస్ సోమర్‌సెట్ మ్యాచ్‌లో లబుషేన్ బాల్ చెలరేగిపోయాడు. గ్లామోర్గాన్ తరఫున బరిలోకి దిగిన లబుషేన్ కేవలం 2.3 ఓవర్స్‌లో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి.. జట్టుకు ఒంటిచేత్తో విజయం అందించాడు. పైగా వేసిన 2.3 ఓవర్స్‌లో ఒక ఓవర్ మెయిడెన్‌గా వేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గ్లామోర్గాన్ నిర్ణీత 20 ఓవర్లో ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ కమ్ ఓపెనర్ కిరన్ కార్ల్‌సన్ విధ్వంసం సృష్టించాడు. సోమర్‌సెట్ బౌలర్లపై చీల్చిచెండాడుతూ.. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సులతో విరుచుకుపడి 135 పరుగులు సాధించి.. గ్లామోర్గాన్‌కు భారీ స్కోర్ అందించాడు. మరో ఓపెనర్ విలియమ్ స్మేల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరి వీరబాదుడితో గ్లామోర్గాన్ 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
సోమర్‌సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 2 వికెట్లతో రాణించాడు. ఇక 244 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సోమర్‌సెట్ 13.3 ఓవర్లలో కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. సోమర్‌సెట్‌ను మార్నస్ లబుషేన్ దారుణంగా దెబ్బతీశాడు. 90 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పోరాడే స్థితిలో ఉన్న సోమర్‌సెట్‌ను 123 పరుగులకే మడతబెట్టేశాడు. పదో ఓవర్ చివరి బంతికి ఒక వికెట్ తీసిన లబుషేన్, తిరిగి 12వ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. పైగా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మెయిడెన్‌గా వేశాడు. ఇక 14వ ఓవర్ వేసేందుకు వచ్చిన లబుషేన్ మూడో బంతికి ఆ మిగిలిన ఒక్క వికెట్ కూడా పడగొట్టాడు. కేవలం 10 బంతుల్ల వ్యవధిలోనే 5 వికెట్లు సాధించాడు. మరి లబుషేన్ బౌలింగ్ మ్యాజిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Marnus Labuschagne picked 5/11 in the Vitality Blast. 😄👌pic.twitter.com/XrKYyHcJ5l
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.