దోమ కాటు ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మనిషిని కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా చేరు వేసే సంఘటనలు ఉన్నాయి. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాయిల్స్ మొదలు లిక్విడ్స్ వరకు దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగిస్తుంటారు.
అయితే దోమకాటులో కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా.? డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తే దోమలను ఎవరిని పడితే వారికి కుట్టవు. ఒక దోమ మనల్ని కుడుతుంది అంటే అందుకు ఒక రిజన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీరు సేవించే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ ఖుబ్‌చందానీ ఈ విషయమై మాట్లాడుతూ.. దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు. ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఓ బ్లెడ్ గ్రూప్ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి. అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.