Amazon Prime Day Sale 2024 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 అతి త్వరలో మొదలు కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు ప్రత్యేకమైన వార్షిక సేల్ జూలై 20 అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్ అన్నింటిపై వందలాది డీల్‌లను అందిస్తుంది. జూలై 21న ఈ సేల్ ముగియనుంది.
48 గంటల సేల్ ఈవెంట్‌లో 450కి పైగా కొత్త ప్రొడక్టుల లాంచ్‌లు కనిపిస్తాయి. భారతీయ, ప్రపంచ బ్రాండ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, మరెన్నో ఆఫర్‌లు ఉంటాయి. మీరు ఏదైనా ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ టాబ్లెట్‌లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం.. మీకు నచ్చిన ట్యాబ్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
బ్యాంకు కార్డులపై మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు :
ఆపిల్, లెనోవో, షావోమీ, శాంసంగ్ వంటి సరసమైన టాబ్లెట్ మోడల్‌లు అద్భుతమైన స్క్రీన్‌లు, గుడ్ బ్యాటరీ లైఫ్‌తో అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఐసీఐసీఐ, ఎస్‌బీఐతో కలిసి కార్డ్‌లు, ఇఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపుపై 10 శాతం సేవింగ్స్ అందిస్తుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2500 వరకు వెల్‌కమ్ రివార్డ్‌లను పొందవచ్చు. రూ. 300 వరకు క్యాష్‌బ్యాక్ రూ. 2,200 రివార్డులు పొందవచ్చు. రియల్‌మి ప్యాడ్ 2 వంటి ఎంపిక చేసిన మోడల్‌లపై అదనపు కూపన్ డిస్కౌంట్లను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ఒరిజినల్ ధర రూ. 36,999 ఉండగా, రూ. 30,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. షావోమీ ప్యాడ్ 6 మోడల్ రూ. 26,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 39,999 నుంచి తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఈ ధరను మరింత తగ్గిస్తాయి. ఈ సేల్ లైవ్‌లోకి వచ్చిన తర్వాత అమెజాన్ కొత్త డీల్స్‌ను ప్రవేశపెట్టవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో మీరు పొందగలిగే టాబ్లెట్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
- ఆపిల్ ఐప్యాడ్ (10వ జనరేషన్) రూ. 39,900, తగ్గింపు ధర : రూ. 30,900
- షావోమీ ప్యాడ్ 6 అసలు ధర రూ. 39,999, తగ్గింపు ధర : రూ. 26,999
- శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 ఎఫ్ఈ అసలు ధర రూ. 44,999, తగ్గింపు ధర : రూ. 29,999
- హానర్ ప్యాడ్ 9 అసలు ధర రూ. 34,999, తగ్గింపు ధర : రూ. 22,999
- రియల్‌మీ ప్యాడ్ 2 అసలు ధర : రూ. 32,000, తగ్గింపు ధర : రూ. 20,999
- లెనోవో ట్యాబ్ ఎమ్11 అసలు ధర : రూ. 31,000, తగ్గింపు ధర : రూ. 14,999
- లెనోవో ప్యాడ్ P12 అసలు ధర : రూ. 40,000, తగ్గింపు ధర : రూ. 23,999
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.