AP Open School Admissions : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పదవ తరగతి ఇంటర్ లో ప్రవేశాల కొరకు పత్రిక ప్రకటన విడుదల చేసింది.
AP Open School Admissions
AP Open School Admissions ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. అడ్మిషన్ల ప్రక్రియ జూన్ నెల 31వ తేదీ నుండి ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 4వ తేదీతో పూర్తవుతుంది.
AP Open School Admissions పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది.
పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు, దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in
ప్రవేశం కొరకు వివరములు
S.No | Item | Dates |
1 | అడ్మిషన్లు ప్రారంభ తేది | 31-07-2024 |
2 | అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది | 27-08-2024 |
3 | అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది. | 28-08-2024 |
4 | Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది | 04-09-2024 |
ఆసక్తి ఉన్న అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనవల్సిందిగా కోరుతున్నాము. అదనపు సమాచారం కొరకు www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను లేదా మీకు సమీపంలోని A.I. సెంటర్ ను సంప్రదించి పూర్తి వివరములు పొందగలరు.