- 2025లో ఆసియా కప్ కు వేదికగా భారత్
- టీ20 ఫార్మాట్ లో పోటీలు
- ఒకే ఒక్కసారి 1990-91లో ఆసియా కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్
Asia Cup Host India భారత్ 2025లో పురుషుల టీ20 ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనుంది. 2023లో ఆసియా కప్ ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహించగా… పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిచ్చాయి. ఈసారి ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనుండగా, ఆతిథ్య హక్కులను భారత్ చేజిక్కించుకుంది.
Asia Cup Host India
కాగా, 1984 నుంచి ఆసియా కప్ టోర్నీ నిర్వహిస్తుండగా… అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఒక్కసారి మాత్రమే ఆతిథ్యమిచ్చింది. 1990-91 సీజన్ లో ఆసియా కప్ కు భారత్ వేదికగా నిలిచింది. ఆ టోర్నీలో టీమిండియానే విజేతగా నిలిచింది.
ఇక, 2027 ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్ కు కేటాయించారు. అయితే బంగ్లాదేశ్ లో జరిగే ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.