ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. శ్రీలంక బ్యాటింగ్లో కెప్టెన్ చమారీ ఆటపట్టు 63 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత.. అనుష్క సంజీవని 24 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటింగ్లో కవిష దిల్హారీ (17), హర్షిత సమరవిక్రమ (12), సుగంధిక కుమారి (10) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలింగ్ లో సాధిక్ ఇక్బాల్ 4 వికెట్లు పడగొట్టింది. నిధా దార్, సోహైల్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్లో మునీబా అలీ (37), గుల్ ఫిరోజా (25), నిధా దార్ (23), ఫాతిమా సనా (23), అలియా రియాజ్ (16) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్లో ఉదేశిక ప్రబోధని, కవిష దిల్హారీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా.. ఆదివారం భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.