Best Sleeping Tip ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో నిద్ర లేమి సమస్య కూడా ఒకటి. ఎంత నిద్ర పోదామని ట్రై చేసినా చాలా మందికి నిద్ర రాదు. రోజంతా ఎంత కష్ట పడి వచ్చినా.. రాత్రి పూట సరైన నిద్ర లేకపోతే చాలా నీరసంగా ఉంటుంది. అంతే కాకుండా ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మనిషికి ఆహారం లేకపోయినా ఉంటాడేమో కానీ.. నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం. ఒక మనిషికి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అందులోనూ ఇంట్లో ఉండే వాళ్ల కంటే.. బయట పని చేసుకున్న వాళ్లకు సరైన నిద్ర లేకపోతే మరింత విసుగ్గా ఉంటుంది. ఇలా నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే గాఢమైన నిద్ర వస్తుంది.
Best Sleeping Tip మనసును ప్రశాంతంగా ఉంచండి:
Best Sleeping Tip సాధారణంగా రాత్రి పూట పడుకునే ముందే రకరకాల ఆలోచనలు వస్తాయి. చాలా మంది వాటిని ఆలోచిస్తూ.. అలా చేయాల్సింది.. ఇలా చేద్దాం అని ప్లాన్స్ వేస్తారు. అంతేకాకుండా ఇతరులతో కలిసి చర్చిస్తారు. అలాంటివి ఆలోచనలు మానేసి మనసును ప్రశాంతంగా ఉంచండి.. కేవలం నిద్ర మీద ధ్యాస పెట్టండి.
ధ్యానం చేయండి:
Best Sleeping Tip నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడం చాలా మంచిది. ఓ అరగంట సేపు అయినా ధ్యానం చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. అంత సమయం కుదరని వారు 10 నిమిషాలు అయినా కేటాయించండి.
సెల్ ఫోన్స్‌కి దూరం:
Best Sleeping Tip రాత్రి సమయాల్లోనే ఎక్కువగా చాలా మంది చాటింగ్ చేయడం, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర సరిగా రాదు. ఉదయం లేవడానికి నిద్ర సరిపోక తలనొప్పి, వికారంగా ఉంటుంది. కాబట్టి మీరు పడుకోవాలి అనుకుంటున్నప్పుడు.. వీటికి దూరంగా ఉంచడం బెటర్.
దాల్చిన చెక్క పొడి:
Best Sleeping Tip మీరు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోండి. ఇలా చేస్తే నిద్ర త్వరగా పడుతుంది. పాలు ఇష్టం లేని వారు గోరు వెచ్చటి నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగండి. రాత్రి పూట పడుకునే ముందు గోరు వెచ్చటి పాలు తాగినా నిద్ర క్లాలిటీ అనేది పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.