Bhayya Ji OTT Thriller Movie నేటికాలంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. కోవిడ్ తరువాత చాలా మంది ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మూవీలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే థియేటర్లో రిలీజైన సినిమాలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారం వారం ఓటీటీలో వచ్చే సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈక్రమంలోనే ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు, ఇతర మూవీస్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలానే తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మరి.. ఆ సినిమా ఏమిటి, ఎందులో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం…
బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చాలా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. అందరిని ఆకట్టుంటారు. అలానే నటుడిగా చాలా సార్లు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మనోజ్ బాజ్‍పేయ్ 100 సినిమాగా ‘భయ్యా జీ’ థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించన స్థాయిలో ఆడలేదు. మిక్స్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించింది. ఇక ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
‘భయ్యా జీ’ మూవీ జూలై 26వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నిఆ సంస్థ అధికారంగా వెల్లడించింది. రాబిన్‍హుడ్ కాదు.. రాబిన్‍హుడ్‍కు బాప్ ఇతడు! దుమ్మురేపేందుకు భయ్యా జీ వచ్చేస్తున్నాడు. భయ్యా జీ జూలై 26న ప్రీమియర్ కానుందని జీ5 ఓటీటీలో పోస్ట్ చేసింది. భయ్యా జీ మూవీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అజ్ఞాతంలో ఉండే మాజీ బడా గ్యాంగ్‍స్టర్.. తమ్ముడి హత్య జరుగుతుంది. గ్యాంగ్ స్టర్ నుంచి సామాన్యడిగా మారి అజ్ఞాతంలో జీవిస్తున్నఆ వ్యక్తి.. తమ్ముడి మర్డర్ తో మళ్లీ గన్ పట్టతాడు. ఇక ఆ గ్యాంగ్ స్టర్ రీవెంజ్ తీర్చుకుంటాడా లేదా ?, చివరకు ఏమవుతుందో తెలియాలంటే భయ్యాజీ సినిమాను చూడాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అలియాజ్ భయ్యా జీగా మనోజ్ బాజ్‍పేయ్ నటించారు. భగీరథి భాయ్ కదమ్, జోయా హుసేన్, జతిన్ గోస్వామి, సువీందర్ విక్కీ, విపిన్ శర్మ, అభిషేక్ రంజన్, ఆచార్య అనంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భయ్యా జీ మూవీని భానుశాలి స్టూడియోస్, ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు. తక్కువ బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో సుమారు రూ.12కోట్ల కలెక్షన్ల వరకు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. సుమారు రెండు నెలల తరువాత ఓటీటీలోకి వస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ మనోజ్ బాజ్‍పేయ్ చాలా పాపులర్. దీంతో ఈ సినిమాజీ5 ఓటీటీలో బాగానే పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.