సన్‌రూఫ్ కారులో నుంచి తల బయటపెట్టడం, ఆ ఫొటోలను.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్. సన్‌రూఫ్ కార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. చాలా మంది కేవలం ఇలాంటి వీడియోలు, ఫొటోల కోసమే సన్‌రూఫ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా తల బయటపెట్టడం నేరమని మీలో ఎంత మందికి తెలుసు. సన్‌రూఫ్ పై నుంచి బయటకు వస్తే ట్రాఫిన్ పోలీసులు చలానా విధిస్తారని మీకు తెలుసా.? అలాంటప్పుడు అసలు కారుకు సన్‌రూఫ్ ఎందుకు ఇస్తారనేగా మీ సందేహం. అయితే దీని వెనకాల ఉన్న అసలు కారణం వేరే ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో సన్‌రూఫ్ కార్ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని టాప్ వేరియంట్స్‌లో ఈ ఫీచర్ కామన్‌గా మారింది. కొన్ని లగ్జరీ కార్లలో అయితే వాయిస్ కమాండ్ ఆధారంగా సన్‌రూఫ్‌ను ఓపెన్, క్లోజ్ చేసుకునే అవకాశం సైతం కల్పించారు. కొంతమంది కారుతో రాకపోయినా ప్రత్యేకంగా మాడిఫికేషన్ చేయించుకొని మరీ వీటిని ఏర్పాటు చేస్తుకుంటున్నారు. అయితే సన్‌రూఫ్ చట్ట విరుద్దమైనప్పటికీ కార్ల తయారీ సంస్థలు వీటిని ఎందుకు ఇస్తాయనే సందేహం రావడం కామన్.
అయితే సన్‌రూఫ్ అనేది కేవలం కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు అనుసరిస్తోన్న ఒక స్ట్రాటజీ మాత్రమే. దీనికి ప్రత్యేకమైన ఉపయోగం అంటూ ఏం లేదు. అయితే కారు ఆగు ఉన్న సమయంలో తల బయటకు పెడితే ఎలాంటి నేరం ఉండదు కానీ, ప్రయాణిస్తున్న సమయంలో తల బయటికి పెడితే మాత్రం జరిమానా చెల్లించాల్సిందే. అయితే కారులోకి నేరుగా సూర్యరశ్మిని అందించడానికి సన్‌రూఫ్ ఉపయోగపడుతుంది. అలాగే సహజంగా గాలి రావాలనుకుంటే ఉపయోగించడానికి మాత్రమే సన్‌రూఫ్‌ను ఇచ్చారు. కాబట్టి కార్లకు సన్‌రూఫ్ ఇవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం తల బయట పెట్టడం కాదు. ఇలా చేయడాన్ని పోలీసులు ప్రమాదకరమైన స్టంట్‌గా పరిగణించి, ఫైన్ వేస్తారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.