బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఉత్తర చైనాలో శుక్రవారం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 30 మంది గల్లంతయ్యారని వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అకస్మాత్తుగా కురిసిన వర్షం, వరదల కారణంగా జూలై 19వ తేదీ (శుక్రవారం) రాత్రి 8.40 గంటల సమయంలో షాంగ్సీ ప్రావిన్స్‌లోని షాంగ్లూలో నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 వాహనాలు, 30 మందికి పైగా వ్యక్తులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నది నుంచి బయటకు తీసిన ఐదు వాహనాల్లో 11 మృతదేహాలను వెలికితీసినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. Source: Praja Sakti
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.