CPI Ramakrishna: ఏపీని దగా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. మరోవైపు.. శాంతిభధ్రతలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు.. వర్షాలతో రాష్ట్రం మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు దాడికి వెళ్ళటం సరైన పద్దతి కాదన్నారు రామకృష్ణ.. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడిందని విమర్శించిన ఆయన.. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇలాంటి దాడులు సరైనది కాదు అని హితవుపలికారు. ఒక ఎంపీనే ఊర్లోకి రానివ్వం అంటూ ఆయనపైనే కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.. సీఎం చంద్రబాబు వీటిని సరిదిద్దాలి.. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి సాయం అందించాలని కోరారు. ప్రభుత్వం రైతులకు హామినిచ్చిన విధంగా రైతుభరోసా నిధులు వెంటనే అందించాలి.. సీఎం చంద్రబాబు కేంద్రం చెప్పిన విధంగా ఈసారైనా విభజన హామీలను అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.