మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంతలో.. క్రౌడ్‌స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఈ సమస్య ఎందుకు తలెత్తింది.. దాన్ని పరిష్కరించడానికి ఏమి చేశారో సోషల్ మీడియా వేదికగా వివరించారు. “విండోస్ హోస్ట్‌ల కోసం సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రభావితమైన కస్టమర్‌లతో క్రౌడ్‌స్ట్రైక్ చురుకుగా పనిచేస్తోంది. మ్యాక్ (Mac), లైనెక్స్ (Linux) హోస్ట్‌లు ప్రభావితం కావు. వాస్తవానికి ఇది సైబర్ దాడి కానే కాదు.. కేవలం ఒక బగ్ ఇష్యూ మాత్రమే..” అని స్పష్టం చేశారు. ఆ బగ్ సమస్యను గుర్తించాం.. దాన్ని సపరేట్ చేశాం.. ఇష్యూ ఫిక్స్ చేశాం.. లేటెస్ట్ అప్‌డేట్‌ల కోసం కస్టమర్‌లను సపోర్ట్ పోర్టల్‌ను విజిట్ చేయండి అని సూచించారు. లేదంటే తమ వెబ్‌సైట్‌లో ఫుల్ అప్‌డేట్స్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
తాజాగా మరోసారి క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. బహుళ పరిశ్రమలకు అంతరాయం కలిగించిన గ్లోబల్ టెక్ వైఫల్యానికి క్షమాపణలు చెప్పారు. “మా కంపెనీతో సహా దీని ద్వారా ప్రభావితమైన వినియోగదారులు, ప్రయాణికులు మా వల్ల సమస్యలు ఎదుర్కున్నందుకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము” అని అతను ఎన్బీసీ న్యూస్ వేదికగా చెప్పారు. చాలా మంది కస్టమర్లు సిస్టమ్‌ను రీబూట్ చేస్తున్నారని.. ఇప్పుడు సర్వర్లు బాగానే పనిచేస్తున్నట్లు తెలిపారు. సర్వర్ వాటంతటఅదే పునరుద్ధరించుకుంటోందన్నారు. కొన్ని సిస్టమ్‌లకు ఇది కొంత సమయం కావచ్చని వెల్లడించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.