Dogs Attack: తెలంగాణలో వీధికుక్కలు మరోసారి వణికిపోతున్నాయి. చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయలకు గురిచేస్తున్నాయి. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులను దొరికిన వారిని దొరికినట్లు దాడి చేసి కాలనీల్లో మృత్యు ఘోష మిగిలిస్తున్నాయి. వీధుల్లో తిరుగుతున్న కుక్కలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా వీధికుక్కలు చిన్న పిల్లల ప్రాణాలను తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా హైదరాబాద్ లోని జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.
ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీధి కుక్కల దాడిలో బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విహాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒంటిపై అనేక చోట్ల కుక్కలు దాడి చేయడంతో శరీరం ఇన్ఫెక్షన్ కు గురైందని వైద్యులు తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నా వీధి కుక్కలు దాడికి తెగబడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
కాగా.. వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని జులై 11న హైకోర్టు ఆదేశించింది. అయినా ఉదాసీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. చిన్నారులు, ప్రజలపై కుక్కల దాడి నేపథ్యంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు విచారణ చేపట్టింది. మృత్యువాత పడుతున్న వీధికుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని విచారణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. వీధి కుక్కలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే వీధికుక్కల దాడిలో రోజుకో చిన్నారుల ప్రాణాలు బలికావడం జరుగుతుందని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఉత్కంఠ నెలకుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.