సదస్సులో ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ
Endowment ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో వేలాది మంది రైతులు దేవాదాయ, ధర్మాదయ సాగుధారులు ఉన్నారన్నారు. వారి సమస్యలు పరిష్కారం చేసి, భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో జిల్లా సదస్సు స్థానిక ప్రజా సంఘాలు కార్యాలయంలో జరిగింది. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వేలాదిగా వున్న వివిధ దేవాదాయ ధర్మాదాయ భూ సాగుదారులు, కౌలు దారులులో 90% సన్నచిన్న కారు, సొంత భూమి లేని రైతులు కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. అలాగే వారసత్వంగా తాత తండ్రులు నుండి సాగుచేస్తు అవే భూములపై ఆదారపడి వున్నారన్నారు. సొంత భూమి వున్న రైతులకి కిట్టుబాటు కాని పరిస్థితిలో కౌలుదారులకు కార్డులు అందకపోవటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెట్టుబడిసాయం, విత్తనం, బ్యాంక్ రుణాలు, మార్కెట్ మరియు భీమా, పరిహారాలు, రాయతీలు పొందలేక సాగు భారంగా వున్నదన్నారు. అలాగే ఈక్రాఫ్ నమోదులో ఆటంకాలు పెడుతున్నారన్నారు.
గతం లో సాగుదారుల నుండి ఎండోమెంట్ అదికారులు కౌలు మూడు సంవత్సరాలకు ఒకసారి ధర పెంచి అదే రైతును కొనసాగించేవారు. ఈ మధ్య కాలంలో బహిరంగ వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ధర పాడితే వారికే కౌలు నిర్ణయించే విధంగా మార్పులు చేయడం జరిగిందన్నారు. ఈ విధానం వల్ల అనేక మంది పేద సాగుదారులు వేలంలో పోటీపడి ఎక్కువకు పాడలేక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారసత్వంగా సాగు చేస్తున్న రైతులు అనివార్యంగా భూమి నుండి గెంటివేయబడుతున్నారు. ఇప్పటికే ఈ విధానం వల్ల సన్న, చిన్న పేదరైతులు అనేక గ్రామాలలో వున్న రాజకీయ, వ్యక్తిగత వైషమ్యాలు వల్ల పోటీ పడి వేలం పాటలలో పెత్తందారులు, సంపన్నవర్గాలు కౌలు ఎక్కువ పాడటం వల్ల వారసత్వంగా సాగులో వున్న కౌలు దారులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. విజయనగరం లో మాన్సస్ తదితర సంస్థలు క్రింద 16000 ఎకరాలు వున్న భూములు సుమారుగా 30 వేలు మంది రైతులు సాగుచేసుకొని జీవిస్తున్నారాన్నారు.
కౌలుదారులను తప్పించి రియల్ ఎస్టేట్ మరియు కార్పోరేట్ సంస్థలకి కట్టబెట్టే దానికి పూనుకుంటున్నారన్నారు. కొంతమంది వారసత్వంగా వచ్చిన రైతుల భూములు కూడా దేవాలయ భూములు క్రింద నమోదు చేసి వారి భూహక్కులను వివాదాల పెట్టి అడ్డుకొంటున్నారన్నారు.
గతంలో సుప్రీం కోర్ట్ చిన్న సన్న కారు సాగుదారులకు బహిరంగ వేలం వెయ్యకుండా 13% కౌలు పెంచి వారినే కొనసాగించాలని ఇచ్చిన మినహాయింపును పక్కనపెట్టి ప్రభుత్వాలు ఎండోమెంట్ అధికారులు ద్వారా బహిరంగ వేలానికి పూనుకుంటున్నారన్నారు. అందువల్ల జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ పూర్వీకుల నుండి భూసాగుదారులు, కౌలుదారులు ఐక్యమై సమస్యలు చర్చించి పరిష్కరించుకొనే దానికి ఐక్యంగా కథలాల్సి ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు సమస్యలు పరిష్కారం చేయకపోవడం వలన ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నరన్నారు. ఎన్నికల ముందు రైతులు సమస్యలు పరిష్కారం చేస్తామని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కావున దేవాదాయ, ధర్మాదయ, భూములు సాగుధారులు సమస్యలు పరిష్కారం చేయాలని, లేని యెడల రైతులు పోరుబాట తప్పదని హెచ్చరించారు. సదస్సులో రైతు సంఘం నాయకులు చల్లా జగన్, జిల్లా అధ్యక్షులు గోపాలం, ఆదినారాయణ మూర్తి, కౌలు రైతు బంగారయ్య, అర్.రాములు, అల్లు అప్పలస్వామి, దేవాదయ, ధర్మాదయ భూసాగు కౌలుదారులు పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ కె.వెంకటరమణ, మద్దీల రమణ, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.