ఇంగ్లండ్.. వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటి. ఆ టీమ్ బరిలోకి దిగుతోందంటేనే మిగతా జట్లన్నీ భయపడతాయి. ద్వైపాక్షిక సిరీస్ కానివ్వండి.. ఐసీసీ టోర్నమెంట్ కానివ్వండి ఇంగ్లీష్ టీమ్ ఒకేలా ఆడుతుంది. దూకుడే మంత్రంగా దూసుకెళ్లుంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆ టీమ్ అటాకింగ్ అప్రోచ్‌తోనే టాప్ రేంజ్‌కు చేరుకుంది. బజ్‌బాల్ మంత్రంతో ఆస్ట్రేలియా సహా అన్ని జట్లను వణికించింది. అయితే ఈ మధ్య కాలంలో బజ్‌బాల్ మ్యాజిక్ పని చేయడం లేదు. భారత పర్యటనలో ఇదే సూత్రాన్ని వాడి బొక్క బోర్లా పడింది స్టోక్స్ సేన. ఇప్పుడు వెస్టిండీస్ కూడా ఆ టీమ్ బెండు తీస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కరీబియన్ వీరులు అదరగొట్టారు.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఏకంగా 457 పరుగులు చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన కరీబియన్ టీమ్ ఇంగ్లీష్ జట్టు సాధించిన స్కోరును అధిగమించడం హైలైట్ అనే చెప్పాలి. కావెమ్ హాడ్జ్ (120), జోషువా డసిల్వా (82) ఇంగ్లండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లు బాది పారేశారు. ఇద్దరూ కలసి 29 బౌండరీలు కొట్టారు. దీంతో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ సహా మిగిలిన బౌలర్లు గుడ్లు తేలేశారు. కెప్టెన్స్ స్టోక్స్ స్వయంగా బౌలింగ్‌కు దిగినా ఆ ఇద్దర్నీ ఆపలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ పనైపోయిందని నెటిజన్స్ అంటున్నారు. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్తో ఇక ఆ జట్టు కథ ముగిసిందని చెబుతున్నారు. మరి.. ఇంగ్లండ్‌ను విండీస్ కోలుకోలేని దెబ్బ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
WHAT A KNOCK, JOSHUA DA SILVA 🔥
– 82* runs from 122 balls including 10 fours & 3 sixes while batting with tailenders, A knock to remember in West Indies Test cricket in recent times. pic.twitter.com/q8EXBW1BCX
— Johns. (@CricCrazyJohns) July 20, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.