Ex-Rolls-Royce Designer : రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ ప్రసిద్ధ పాతకాలపు కార్ల నిపుణుడు ఇయాన్ కామెరూన్ దారుణ హత్యకు గురయ్యారు. జర్మనీలోని లేక్ అమెర్సీ సమీపంలోని హెర్షింగ్‌లో తన 3 మిలియన్ డాలర్ల భవనంలో ఈ హత్యా ఘటన జరిగింది. దోపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి భవనంలోకి చొరబడి 74 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు కామెరూన్‌ను కత్తితో పొడిచి హత్యచేశాడు.
అదే సమయంలో ఇంట్లో ఉన్న ఆయన భార్య వెరెనా క్లూస్ తృటిలో దాడి నుంచి తప్పించుకుంది. భయంతో పరుగులు తీసిన ఆమె భవనం పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి పొరుగువారి ఇంట్లో దూకింది. అనంతరం వెరెనా క్లూస్ పోలీసులకు సమాచారం అందించింది.
ది సన్ నివేదిక ప్రకారం.. విలువైన వస్తువులను స్టోర్ చేసిన గ్యారేజీలకు విద్యుత్ తీగలను ఎవరో కత్తిరించినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. భవనంలోకి చొరబడిన అనుమానితుడు 190 సెంటీమీటర్ల మధ్య పొడవు, లేత-రంగు ప్యాంటు, ముదురు-నీలం రంగు చొక్కా, పసుపు-ఆకుపచ్చ గ్లోవ్స్, ఎరుపు బ్యాక్‌ప్యాక్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది హింసాత్మక చర్యని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హంతకుడిని పట్టుకోవడానికి డాగ్స్, హెలికాప్టర్ ద్వారా బృందాలు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఇయాన్ కామెరూన్ ఎవరు?
ఘోస్ట్, ఫాంటమ్, 3 సిరీస్, Z8 వంటి మోడళ్ల రూపకల్పనలో ఇయాన్ కామెరాన్ కీలక పాత్ర పోషించారు. 1998లో బీఎండబ్ల్యూ (BMW) కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత కామెరాన్ రోల్స్ రాయిస్‌లో చేరారు. 2013లో పదవీ విరమణ చేశారు. కామెరాన్ అందించిన సేవల గురించి బీఎండబ్ల్యూ మాట్లాడుతూ.. “మా మాజీ రోల్స్ రాయిస్ డిజైనర్ హత్య గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం.
ఈ కష్ట సమయాల్లో ఆయన కుటుంబం, స్నేహితులకు అండగా ఉంటాం. రోల్స్ రాయిస్‌ను మొదట బీఎండబ్ల్యూ గ్రూప్ కొనుగోలు చేసి తరలించినప్పటి నుంచి ఇయాన్ కీలక పాత్ర పోషించారు. గుడ్‌వుడ్, వెస్ట్ సస్సెక్స్‌లోని ఇంటికి ఇయాన్ పదవీకాలంలో మారింది. ఆయన అన్ని ఫాంటమ్ ఫ్యామిలీ, ఘోస్ట్ మోడల్‌ల కోసం డిజైన్ బృందానికి నాయకత్వం వహించారు. మార్క్ డిజైన్ వంశానికి సానుభూతితో కూడిన సమకాలీన మోటారు కార్లను సృష్టించారు” అని పేర్కొంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.