సేవింగ్స్, హోమ్‌లోన్స్ ఉంటే పాత పన్ను విధానం బెస్ట్..
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చూడటానికి కొత్త పన్ను విధానం ఊరించేలా ఉన్నా… సేవింగ్స్, హోమ్‌లోన్స్, ఎల్‌ఐసీ తదితర మినహాయింపులు కావాల్సిన వారికి మాత్రం పాత పన్ను విధానమే బెస్ట్ అంటున్నారు ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్.
ఆదాయం 15 లక్షల రూపాయలకు పైబడి ఉన్నవారికి ఏ పన్ను విధానమైనా ఒక్కటేనని అభిప్రాయపడుతున్నారు. సేవింగ్స్, హోమ్‌లైన్స్, ఎల్‌ఐసీ తదితర మినహాయింపులు లేనివారికి, సీనియర్ సిటిజన్స్‌కు కొత్త పన్ను విధానం ఎంతో ప్రయోజకరమని వారు చెబుతున్నారు.
పాత పన్ను విధానం
- సేవింగ్స్, హోమ్‌లోన్స్ ఉంటే పాతదే బెస్ట్
- 60 ఏళ్లలోపు వారికి ఇది అనుకూలమైనది
- వేతన జీవులకు పాత పన్ను విధానం ఉత్తమం
- మినహాయింపులు క్లెయిమ్ చేసేందుకు అవకాశం
- కేవలం అధిక భారం పడుతున్నట్లు పాతపన్ను విధానం కనపడుతుంది
- నిర్దిష్ట పెట్టుబడి సాధనాల్లోనే ఇన్వెస్ట్‌మెంట్
- పాతపన్ను విధానాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు
కొత్త పన్ను విధానం
- సీనియర్ సిటిజన్స్‌కు ఇది ఎంతో ప్రయోజనకరం
- వ్యాపారస్తులకు కొత్త పన్ను విధానమే బెస్ట్
- పరిమితమైన మినహాయింపులకు ఛాన్స్
- పొదుపు, రుణాలు లేకుంటే కొత్తది మంచిది
- చూడడానికి ఊరించేలా కొత్త పన్ను విధానం ఉంటుంది
- ఇష్టమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది
- కొత్త పన్ను విధానాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు
మరిన్ని వివరాలు
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.