Godavari Floods : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద 11 లక్షల 44వేల 645 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద..
అటు.. తుంగభద్ర డ్యామ్ 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయనికి గంగమ్మ పరుగులు పెడుతోంది. తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది. తుంగభద్ర పరివాహక ప్రాంతానికి చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర జలాశయనికి ఇరువైపులా ఉన్న కర్ణాటక, ఆంద్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 50 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే ఇన్ ఫ్లో ను బట్టి ఏ సమయంలోనైనా ఔట్ ఫ్లో పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తి స్థాయి నీటి మట్టం : 1633 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం : 1628.09 అడుగులు
పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం : 105.788 టీఎంసీలు
ప్రస్తుత నీటి సామర్థ్యం : 87.056 టీఎంసీలు
ఇన్ ఫ్లో – 1,01,993 క్యూసెక్కులు
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.