వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్‌పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గుర్తించిన బాధితురాలి కుమార్తె.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ దారుణం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
ఆర్థ్రోస్కోపీ చికిత్స కోసం కజకిస్థాన్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ ఆర్టెమిస్ హాస్పిటల్లో జూలై 9న ఆస్పత్రిలో చేరింది. టెస్టుల తర్వాత వైద్యులు ఆమెకు శనివారం శస్త్ర చికిత్స చేశారు. అనంతరం నార్మల్ వార్డుకు తరలించారు. సహాయంగా ఆమె కుమార్తె ఉంది. ఆదివారం అటెండర్.. ఠాకూర్ సింగ్ (24).. మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తుండగా.. ఆమె కుమార్తె గుర్తించి పెద్ద పెద్దగా కేకలు వేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇక సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (2) (e) (రేప్) కింద సింగ్‌పై FIR నమోదు చేశారు. సోమవారం సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం అధికారులతో సహకరిస్తామని ఆర్టెమిస్ హాస్పిటల్ ప్రతినిధి వెల్లడించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.