క్యాన్సర్ మహమ్మారి.. ప్రపంచాన్ని భయపడుతున్న వ్యాధుల్లో ఒకటి. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ క్యాన్సర్ బారిన పడటం చాలా కామన్ గా కనిపిస్తుంది. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన క్యాన్సర్ కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ కి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముందుగా గుర్తించడమే ప్రధాన సమస్యగా మారింది. కానీ ఈ క్యాన్సర్ పై జరుగుతున్న కొన్ని అధ్యాయానల ద్వారా అందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. జనరల్ గా బరువు తగ్గడానికి, లేదా పండగ సమయంలో ఆచరించే ఒక నియమం ద్వారా క్యాన్సర్ కణతిని మనం తగ్గించుకోవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు తగ్గడం కోసం, ఫిట్ గా ఉండడం కోసం, పండుగ సమయాల్లో చేసే ఉపవాసం వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కష్టం లెక్కలపై చేసిన ఈ పరిశోధనలు సక్సెస్ అవడంతో మనుషులపై కూడా సక్సెస్ అవుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపవాసం చేయడం వల్ల శరీరం యొక్క సహజమైన రక్షణ స్థాయి మెరుగుపడుతుందని దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలకలపై చేసిన పరిశోధనలో ఉపవాసం వల్ల క్యాన్సర్కు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ శక్తివంతం చేస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. ఉపవాసం వల్ల సహజ కిల్లర్ కణాల పనితీరు మెరుగుపడుతుందని ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేసే రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన భాగం అని వారు గుర్తించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.