Heart Attack Symptoms గుండె పోటుతో వృద్ధులే కాకుండా వయసున్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. దీన్నే సడెన్ కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది అందరికీ రాదు. ప్రతీసారి కూడా జరగదు. ఒక్కోసారి ధమనుల్లోని సమస్యల వల్ల హార్ట్ ఎటాక్ అనేది వస్తుంది. అసలు గుండె నొప్పి వస్తుందన్న విషయం కూడా మీకు సరిగ్గా తెలీదు. కానీ ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలను కూడా శరీరం కొన్ని లక్షణాల ద్వారా తెలియజేస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చెమటలు అధికంగా పడతాయి:
సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది అనడానికి చెమటలు కూడా ఒక కారణం. ఎలాంటి శ్రమ, ఆందోళన లేకుండా చెమటలు ఎక్కువగా పడితే మాత్రం అది హార్ట్ ఎటాక్ రావడానికి కారణం అని తెలుసుకోండి. అలాగే వికారం, నార్మల్‌గా తలనొప్పి ఉందనిపిస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గడం వల్ల స్పృహ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది.
గుండె నొప్పి:
Heart Attack Symptoms సైలెట్ మార్ట్ ఎటాక్ రావడానికి కామన్‌గా కనిపించే పాయింట్ ఏంటంటే.. గుండెల్లో నొప్పి. ఛాతీలో నొప్పి వచ్చి చాలా అసౌకర్యంగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీకు గుండెల్లో నొప్పిగా ఉందనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవడం మంచిది.
అలసట:
అలసట కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి లక్షణంగా చెప్పొచ్చు. ఎక్కువగా పని ఎక్కువైనా, నిద్ర సరిగ్గా లేకపోయినా అలసటగా అనిపిస్తుంది. సాయంత్రానికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఎలాంటి శ్రమ, ఒత్తిడి, పని లేకుండా అలిసిపోయినట్లు అనిపిస్తే.. వైద్యుల్ని కలవండి.
కండరాల్లో నొప్పులు:
కండరాల్లో నొప్పులు ఎక్కువగా వస్తున్నా కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణం. మెడ, దవడ, చేతులు, భుజాలు, వీపులో నొప్పులు కనిపిస్తాయి. అలాగే పొత్తి కడుపు దిగువ భాగాన కూడా నొప్పి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది.
Heart Attack Symptoms ఊపిరి ఆడకపోవడం:
ఊపిరి సరిగా ఆడక పోవడం, తల తిరిగినట్లుగా అంటే కళ్లు తిరుగుతున్నట్లుగా ఉన్నా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి లక్షణంగా చెప్పొచ్చు. అంతే కాకుండా మైకంగా, అలసట, శ్వాస సమస్యగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.