హీరో కంపెనీ నుంచి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలకు దేశంలో ఆదరణ బాగుంటుంది. ఎంతో మన్నిక, నాణ్యత కలిగిన ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ కంపెనీ విడుదలచేసే కొత్త వాహనాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రజల ఆదరణకు అనుగుణంగానే హీరో కంపెనీ తన పేరుకు తగ్గట్టుగా దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగినే నేపథ్యంలో హీరో కంపెనీ కూడా ఆ రంగంలోకి ప్రవేశించింది. అనేక మోడళ్ల ఈవీలను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈవీల రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. హీరో ఎలక్ట్రిక్ వాహనాలకూ ప్రజల ఆదరణ ఎంతో బాగుంది.
తక్కువ ధరలో..
ప్రజలకు అందుబాటులో ధరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది విడుదల చేయాలని హీరో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది కొత్త ఈవీ వేరియంట్ ను విడుదల చేసే అవకాశం ఉంది. మార్కెట్ లో అమ్మకాలను పెంచుకోనే వ్యూహంలో భాగంగా తక్కువ ధరకు కొత్త స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఏడాదే విడుదల..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సంబంధించిన విషయాన్ని ఇటీవల జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో చర్చించారు. ప్రజలకు అందుబాటు ధరలో ఈ ఏడాదే తీసుకురావాలని నిర్ణయించారు. విడా వీవన్ ప్లస్ ఆధారంగా దీన్ని రూపొందించనున్నట్టు సమాచారం.
పక్కా ప్రణాళిక..
కొత్త స్కూటర్ ను విడుదల చేయడం ద్వారా హీరో కంపెనీ తన వాహన శ్రేణిని విస్తరించి, మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మధ్య-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రజలకు పరిచయం చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తోంది.
కొత్త స్కూటర్..
హీరో కంపెనీ విడుదల చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నిఅంశాలు బయటకు వచ్చాయి. విడా వీవన్ ప్లస్ ఆధారంగా మరింత తక్కువ ధరకు కొత్త స్కూటర్ తయారు చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం విడా వీవన్ ప్లస్ లో 3.44కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉంది. అయితే కొత్త స్కూటర్ కు చిన్న బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేస్తారని సమాచారం. దీని వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే కొన్ని ఫీచర్లను తొలగించే అవకాశం కూడా ఉంది. కానీ ప్రొడెక్షన్ మోడల్ విడుదలైన తర్వాతే ఈ విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది.
త్వరలో మార్కెట్లోకి..
ప్రస్తుతం మార్కెట్ లో అనేక బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తున్నాయి. వాటిలో ఓలా ఎస్ వన్ ఎక్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ కొనసాగుతున్నాయి. ఈ జాబితాలోకి చేరడానికి హీరో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అందుకు తక్కువ ధరకు ఈవీ విడుదల చేయడానికి చర్యలు తీసుకుంది. మన దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వీరికి అనుకూలమైన స్కూటర్లను తయారు చేసి, విక్రయాలను పెంచుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. కాబట్టి మనం త్వరలోనే హీరో కంపెనీ నుంచి విడుదలయ్యే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చూడవచ్చు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.