మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా.. గ్రూప్-A తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 108 పరుగులు చేసింది. దీంతో.. 109 రన్స్ టార్గెట్తో భారత్ రంగంలోకి దిగిన ఈజీగా విక్టరీ సాధించింది. భారత్ బ్యాటింగ్ లో స్మృతి మంధాన అత్యధికంగా (45) పరుగులు చేసింది. ఆ తర్వాత.. షఫాలీ వర్మ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత.. హేమలత (14), హర్మన్ప్రీత్ కౌర్ (5*), జెమిమా రోడ్రిగ్స్ (3*) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలింగ్లో సయ్యదా అరూబ్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. నష్రా సంధు ఒక వికెట్ తీసింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సిద్రా అమీన్ అత్యధికంగా (25) పరుగులు చేసింది. తుబా హసన్ (22), ఫతిమా సనా (22), మునీబా అలీ (11), నిదా దార్ (8), అలియా రియాజ్ (6), గుల్ ఫిరోజా (5) పరుగులు చేసింది. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ 108 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ తలో రెండు వికెట్లు తీశారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.