Karnataka Health Minister శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది. జైపూర్ నుంచి బయలుదేరిన రైలులో 90 కంపార్ట్‌మెంట్లలో మూడు టన్నుల బరువున్న మాంసం లభ్యమైంది. సమాచారం అందుకున్న గో సంరక్షకులు స్టేషన్‌కు చేరుకుని కుక్క మాంసం అంటూ నానా హంగామా చేశారు.
Karnataka Health Minister
కాగా.. పోలీసు శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి 84 మాంసం నమూనాలను సేకరించారు. జంతువుల జాతులకు సంబంధించిన విశ్లేషణ కోసం నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. జంతు మాంసం రవాణా ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధన సంస్థకు పంపించారు. ఇక్కడి నుంచి వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఆ మాంసం గొర్రెలదేనని నిర్ధారించారు.
Karnataka Health Minister ఈ కేసులో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మాంసం రవాణాపై మొదటి ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ పనిని అడ్డుకున్నందుకు గోసంరక్షకుడిపై రెండవ ఎఫ్‌ఐఆర్.. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో గుమిగూడినందుకు గోసంరక్షకుడు, అతని సహచరులపై మూడవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిరోహి అనే ప్రత్యేక మేక జాతికి చెందిన మాంసం అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారి తెలిపారు. ఇది సాధారణంగా రాజస్థాన్.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో లభిస్తుంది. అయితే.. కర్ణాటకలో మటన్ సరఫరా తక్కువగా ఉండడంతో కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.