ప్రజాశక్తి – ఆలమూరు(కోనసీమ) : భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని పెనికేరు, మోదుకూరు, గుమ్మిలేరు, ఆలమూరు గ్రామాల పరిధిలో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు వెంట రాగా క్షుణ్ణంగా పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకొని భరోసా అందించారు. ముంపు నీరు పంట పొలాల నుంచి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. వర్షాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది గనుక ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, కాచిన నీటిని తాగడం, పరిశుభ్రత పాటించడం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మి లావణ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.