కేంద్ర ప్రభుత్వం ఇన్సురెన్స్ కంపెనీలకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. 2047 నాటికి దేశంలో ప్రతి పౌరుడికి ఓ బీమా పాలసీ ఉండి తీరాలని పిలుపునిచ్చింది. ఈ లక్ష్యం దిశగా అన్ని బీమా కంపెనీలు తమ ఉత్పత్తులను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలను చైతన్య పరుస్తూ ప్రతి ఒక్కరూ పాలసీలు తీసుకునే విధంగా మొబలైజ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశంలోని అతి పెద్ద ఇన్సురెన్స్ కంపెనీ అయినా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకస్యూరెన్స్ కంట్రిబ్యూషన్ పెంచడానికి, అందరికీ జీవిత బీమాను కవరేజీ అందించడానికి కార్పొరేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జూలై 16న రెండు కంపెనీలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
Press Release: Partners in Protection: LIC of India & IDFC First Bank Ltd. join forces to bring you comprehensive life insurance solutions! pic.twitter.com/gDDM8onE6m
— LIC India Forever (@LICIndiaForever) July 16, 2024
ఐడీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఎల్ఐసీ పాలసీ..
ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో చేసుకున్న ఈ ఒప్పందంతో ప్రత్యేకమైన వెసులుబాటు కలుగనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కు చెందిన కోటి మంది కస్టమర్లు ఇప్పుడు ఈ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ద్వరా ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం ఇప్పటికే డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రారంభించినట్లు ఎల్ఐసీ ఓ ప్రతికా ప్రకటనలో పేర్కొంది. ఇది పూర్తయిన తర్వాత, వినియోగదారులు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెబ్సైట్ నుంచి ఎల్ఐసీపాలసీలను కొనుగోలు చేయగలుగుతారు. ఇది కస్టమర్లకు ప్రత్యేక వెసులుబాటు ఇవ్వనుంది. ప్రతి ఒక్కరూ ఎల్ఐసీ పాలసీల గురించి తెలుసుకోవడానికి, పాలసీలను ప్రారంభించడానికి సులువైన మార్గాన్ని అందిస్తుంది.
2047 నాటికి అందరికీ బీమా..
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 3,600 బ్రాంచ్లు, శాటిలైట్ ఆఫీసుల ద్వారా విస్తారమైన నెట్వర్క్.. అలాగే 1000 బ్రాంచ్ల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా జీవిత బీమాను అందుబాటులోకి తెస్తుందని, అలాగే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది సాయపడుతుందని ఎల్ఐసీ పేర్కొంది. జీవిత బీమా అనేది ప్రతి కుటుంబానికి రక్షణనిస్తుందని, అందుకు ఎల్ఐసీ తోడ్పాటునిస్తుందని పేర్కొంది. దేశంలోని అగ్రగామి బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ సమాజంలోని అన్ని వర్గాల కోసం యాన్యుటీ, యులిప్, సేవింగ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో సహా అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉంది. ఎల్ఐసీ అంటే జనాల్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి ఇప్పుడు ప్రైవేటు బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా తోడవడంతో మరింత వేగంగా వ్యాపార వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.