Mohammed Shami : టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే.. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడం పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లలో కొందరికి నచ్చడం లేదు. ఈ క్రమంలో భారత విజయాన్ని తక్కువ చేసేందుకు కష్టపడుతున్నారు. బాల్ ట్యాంపరింగ్ చేశాడరని, బాల్‌లో పరికరాలు అమర్చారంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా భారత లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆస్ట్రేలియా పై అత్యత్తమ బౌలింగ్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ రివర్స్ సింగ్ రాబడుతున్నాడని, బాల్ టాంపరింగ్ చేసే అతడు ఈ విధంగా చేస్తున్నాడని, అంపైర్లు కాస్త కళ్లు తెరిచి చూడాలని పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపణలు చేశాడు.
దీనిపై టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు. చీలమండల గాయానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న షమీ ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు. పాక్ మాజీలు మాపై ఎల్లప్పుడూ విషం గక్కుతూనే ఉంటారు. వాళ్లు ఎప్పటికీ మారరు. ఒకరేమో మ్యాచ్‌లో మాకు భిన్నమైన బంతిని ఇచ్చారని అంటారు, ఇంకొకరు బంతిలో చిప్ ఉందని చెబుతారు.
బంతిని కోసి చూపిస్తా.. అందులో మీరు అనుకున్నట్లుగా పరికరం ఉందో లేదో చూసి చెప్పండి. ఇంజమామ్‌ను గౌరవిస్తా.. ఒకవేళ పాక్ ఆటగాళ్లు రివర్స్ స్వింగ్‌ను రాబట్టి ఉంటే అప్పుడు కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేసేవారా..? అంటూ మండిపడ్డాడు. ఓ బౌలర్ బంతిని స్వింగ్, రివర్ స్వింగ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు అని అంటే అది అతడి నైపుణ్యం మాత్రమేనని చెప్పాడు. వక్రీమ్ అక్రమ్ కూడా బంతిని అంపైర్లే ఇస్తారు అని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నాడు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.