సంతోషం.. కాలం, ప్రాంతం, వ్యక్తులను బట్టి మారే ఓ రహస్య పదార్థం. అసలు సంతోషం అంటే ఏంటి.? దీనికి ఠక్కున సమాధానం చెప్పడం ఎవరి వల్ల కాదు. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో అర్థం ఉంటుంది. అందుకే సంతోషానికి అర్థం మారుతూనే ఉంటుంది. అయితే ప్రతీ ఒక్కరూ కోరుకునేది ఈ సంతోషమే. ఇందుకోసమే మానవ మనుగడ సాగుతుంటుంది. ఈరోజు కష్టపడ్డా సరే రేపు సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే సంతోషం అనేది కేవలం డబ్బు సంపాదనలో ఉండదు. మనం జీవించే విధానంలో కూడా ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే అంతా వృధానే.
మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఈ సృష్టిలో ప్రతీ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో సమాధానం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. ఒక్క భారతీయులే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు భగవద్గీతను ఫాలో అవుతుంటాయి. కార్పొరేట్ కంపెనీలు మొదలు సామాన్య ప్రజల వరకు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతీ సవాలుకు సమాధానం ఈ పవిత్ర గ్రంథంలో ఉంటుంది. మరి సంతోషంగా ఉండాలంటే జీవితంలో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* సముద్రంలోకి నదుల నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ సముద్రం మాత్రం నిలకడగా ఉంటుంది. అలాగే మన మనసులోకి నిత్యం ఎన్నో ఆలోచనలనే ప్రవాహాలు దూసుకొస్తూనే ఉంటాయి. అయితే అలాంటి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని చెడు ఆలోచనలు, మిమ్మల్ని బాధించే జ్ఞాపకాలు మనసును మెలిపెడుతోన్న నిగ్రహంతో ఉండాలి. అప్పుడే జీవితంలో మీరు అనుకున్న స్థానానికి చేరుకుంటారు.
* ఇక సంతోషంగా ఉండాలంటే మనిషికి ఉండకూడని మూడు ప్రధాన అంశాలు. మోహం, దురాశ, కోపం.. ఈ మూడే మనిషి పతనానికి కారణమవుతాయి. ఎన్నో సమస్యలకు కారణం కూడా ఇవే. ఎవరిపై ఎక్కువ ఇష్టం, ఇతరులపై దురాశ, కోపం ఇందులో ఏది ఎక్కువైనా మనశ్శాంతి దూరం అవ్వడం ఖాయం.
* ఇక చాలా మంది బాధపడేది చేసిన పనికి ప్రతిఫలం దక్కలేదనో, లేదో అసలు పని మొదలు పెడుతున్నప్పుడే.. ఫలితం వస్తుందో రాదో అనే భయంతో ఉంటారు. అయితే మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రమే అనే భావన మీలో కచ్చితంగా ఉండాలి. మీరు పని మాత్రమే చేయాలి.. ఇక ఫలితం అంటారా.? అది సమయం, మీ పక్కన వారి మీద ఆధార పడి ఉంటుంది. కాబట్టి ఫలితం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళ్లలేరు.
* మనకు వచ్చే కష్టాలు తాత్కాలికమేననే ఆలోచనలో ఉంటారు. జీవితమనే ప్రయాణంలో కష్టాలు కేవలం స్పీడ్ బ్రేకర్స్‌లాగా భావిస్తేనే సంతోషంగా ఉంటాం. అలా కాదని వాటిని పట్టుకొని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము. కాబట్టి కష్టాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలి.
* అంతా మన మంచికే అనే భావన జీవితంలో పెంపొందించుకోవాలి. గతంలో మనకు నచ్చని, ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనే ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఏదో ఒకరోజు అవి మన మంచికే జరిగాయన్న భావనతో ఉండాలి. ఇలా పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉంటే కచ్చితంగా సంతోషం మీ సొంతమవుతుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.