Motorola Edge 50 Neo Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్లను ప్రవేశపెడుతోంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా నుంచి మోటోరోలా రెజర్ 50 సిరీస్ వరకు లాంచ్ అవుతోంది. అయితే, లెనోవో సబ్-బ్రాండ్ గత ఏడాదిలో మోటోరోలా ఎడ్జ్ 40 నియోకు అప్‌గ్రేడ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 నియోను త్వరలో లాంచ్ చేయవచ్చని ఇప్పుడు లీక్‌లు సూచిస్తున్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్పెసిఫికేషన్లు :
నివేదిక ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో 6.4-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి-జీ615 జీపీయూ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇదే ప్రాసెసర్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లో చివరిగా కనిపించింది.
ఆప్టిక్స్ వారీగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ సెకండరీ సెన్సార్, 10ఎంపీ సెన్సార్ కూడా ఉండవచ్చు. అదే సమయంలో, సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,310mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హలో యూఐతో రన్ కావచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.3, ఎన్ఎఫ్‌సీ ఐపీ68 ప్రొటెక్షన్ కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. 71.2ఎమ్ఎమ్ x 154.1ఎమ్ఎమ్ x 8.1ఎమ్ఎమ్ కొలతలతో రావచ్చు. 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. రాబోయే ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్, పోయిన్సియానా అనే 4 కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో, ధరల వారీగా ఎడ్జ్ 40 నియో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 22,999, 12జీబీ ర్యామ్ మోడల్‌కు రూ. 24,999గా నిర్ణయించింది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా ఎలాంటి ధర వివరాలను నిర్ధారించలేదు. మోటోరోలా ఎడ్జ్ 50నియో ఇదే విధమైన బాల్‌పార్క్‌లో ధర ఉంటుందని ఆశించవచ్చు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.