ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నాదెండ్ల మనోహర్‌గా నియమిస్తున్నట్లు స్పీకర్‌కి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. జనసేన పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్‌ను నియమించారు.
మరోవైపు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జనసేన కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. పార్టీ వాలంటీర్లను ఈ ప్రక్రియ కోసం ఎంపిక చేశారు. సభ్యత్వ నమోదు కోసం యాప్ వాడుతున్నారు.
గత ఏడాది మొత్తం 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నమోదు చేయలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు భారీగా సీట్లు రావడంతో పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెల్ప్ లైన్లనూ అందుబాటులో ఉంచారు.
శాసన సభలో జనసేన డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గా శ్రీ @mnadendla గారు pic.twitter.com/e13xC06kem
— JanaSena Party (@JanaSenaParty) July 22, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.