40కి పైగా పిటిషన్లపై సుప్రీం విచారణ….
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ … 40కి పైగా పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతఅత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషన్ల పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గత గురువారం సర్వోన్నత న్యాయస్థానం మాట్లాడుతూ … నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను జులై 20 న శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెంటర్ల వారీగా ఫలితాలను వెబ్ సైట్‌లో ఎన్టీఏ పొందుపరిచింది. ఈ ఫలితాలను Exams.nta.ac.in/NEET/, neet.ntaonline.in లో చూసుకోవచ్చునని పేర్కొంది.
మళ్లీ ఈనెల 22 న విచారణ….
మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని సుప్రీం తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ నేడు ఫలితాలను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.