Ola Scooter Fine by Consumer Forum భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తారాస్థాయికు చేరింది. దేశంలో ఎన్ని కంపెనీల ఈవీ స్కూటర్లు ఉన్నా ఓలా ఈవీ స్కూటర్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల దేశంలో అత్యధిక ఈవీ స్కూటర్లు అమ్మిన కంపెనీగా ఓలా రికార్డు సృష్టించింది. అయితే ఇంతటి మంచి పేరు ఉన్న ఓలా కంపెనీలు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బెంగుళూరులోని వినియోగదారుల న్యాయస్థానం ఇటీవల 1.94 లక్షల రూపాయల జరిమానా విధించింది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూలై 10న ఈ మేరకు తీర్పు వెలువరించింి. ఫిర్యాదుదారు చెల్లించిన తేదీ నుంచి మొత్తం చెల్లింపు జరిగే వరకు సంవత్సరానికి 6 శాతం వడ్డీతో రూ. 1.62 లక్షలను వాపసు చేయాలని ఓలా ఎలక్ట్రిక్‌ని ఆదేశించింది. ఫిర్యాదుదారుని మానసిక వేదన, కష్టాలకు పరిహారంగా రూ.20వేలు, వ్యాజ్యానికి అయ్యే ఖర్చు రూ.10వేలు చెల్లించాలని ఓలాను ఆదేశించింది. అసలు ఓలా కంపెనీపై వినియోగదారుడు ఏ కంప్లైంట్ చేశాడు? ఎందుకు వినియోగదారుల కమిషన్ ఓలా కంపెనీకు జరిమానా విధించిందో? ఓ సారి తెలుసుకుందాం.
Ola Scooter Fine by Consumer Forum
బెంగళూరులోని ఆర్‌టి నగర్‌కు చెందిన నిషాద్ అనే వ్యక్తి ఫిర్యాదులో ఓలా డ్యామేజ్‌డ్ వాహనాన్ని డెలివరీ చేసిందని, అయితే దానిని రిపేర్ చేయడం లేదని, అలాగే రిప్లేస్ చేయడానికి కూడా నిరాకరిస్తుందని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తాను డిసెంబర్ 12, 2023న ఓలా ఎస్ 1 ప్రోను కొనుగోలు చేశాని, షోరూమ్ ధర రూ. 1.47 లక్షలతో పాటు రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీల కోసం రూ. 16,000 చెల్లించానని తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో డెలివరీ సమయంలో వాహనం వెనుక ఎగువ ప్యానెల్ దెబ్బతిన్నట్లు గమనించి ఓలా షోరూమ్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఆ కంపెనీ ప్రతినిధులు “రియర్ అప్పర్ ప్యానెల్ డ్యామేజ్‌గా నమోదు చేశారు. అయితే వాహనం డెలివరీ తీసుకున్న తర్వాత నిషాద్ చేయని హారన్, ప్యానెల్ బోర్డ్ డిస్‌ప్లే వంటి ఇతర లోపాలను కూడా గమనించాడు. జనవరి 23న సమస్యను ఓలా షోరూమ్‌కు నివేదించాడు. అయినా ఓలా షోరూమ్ ప్రతినిధులు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
బాధితుడి ఫిర్యాదుపై బెంగళూరులోని 4వ అదనపు జిల్లా ఫోరం ప్రెసిడెంట్ ఎంఎస్ రామచంద్ర మాట్లాడుతూ ఫిర్యాదుదారుకి 22.01.2024న డెలివరీ చేసిన కొత్త వాహనం ప్యానల్ బోర్డ్ డిస్‌ప్లే వంటి అనేక సమస్యలను అభివృద్ధి చేసినట్లు ఫిర్యాదు విషయాలను కమిషన్ పరిశీలించిందని పేర్కొన్నారు. పనితీరు, హారన్ వైఫల్యం, వాహనం డెలివరీ సమయంలో ఎగువ ప్యానెల్‌కు నష్టం జరిగినా ఓలా సరిగ్గా స్పందించలేదని, ఫిర్యాదుదారు లీగల్ నోటీసు పంపినా ఎలాంటి స్పందనా లేదని అలాగే వినియోగదారుల కమిషన్ నోటీసు జారీ చేసినా ఓలా ప్రతినిధులు కమిషన్ ముందు హాజరుకాకపోవడం జరిమానా విధించినట్లు తెలిపారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.