OnePlus Nord 4 Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ 4 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ పాత జనరేషన్ కన్నా తక్కువ ధరలో వన్‌ప్లస్ నార్డ్ 3కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. ఈ కొత్త వెర్షన్ ధర రూ. 30వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. నార్డ్ 3 ధర ట్యాగ్ రూ. 33,999 కన్నా తక్కువగానే ఉంది. వన్‌ప్లస్ ఫోన్ పవర్‌ఫుల్ మిడ్ రేంజ్ స్పాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ఎస్ఓసీని ప్యాక్ చేస్తుంది. 4 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను కూడా పొందుతుంది. మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ నార్డ్ 4 భారత్ ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999కు అందిస్తోంది. 8జీబీ ర్యామ్+ 256జీబీ మోడల్ ధర రూ. 32,999కు అందిస్తోంది. టాప్-ఎండ్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 35,999తో వస్తుంది. కొత్త వన్‌ప్లస్ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. లాంచ్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కూడా రూ. 3వేల వరకు తగ్గింపు ఉంటుంది. ఓపెన్ సేల్ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. జూలై 20 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,150నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.74-అంగుళాల U8+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. వన్‌ప్లస్ నార్డ్ 4 మోడల్ 8జీబీ, 12జీబీ లేదా 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ లేదా 256జీబీ లేదా 512జీబీ యూఎఫ్ఎస్4.0 స్టోరేజ్ నుంచి ఎంచుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 4కి 4ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్, 6ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతోంది.
హుడ్ కింద 100డబ్ల్యూ సూపర్ వూక్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ ఛార్జర్ కేవలం 28 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ ప్రధాన సోనీ ఎల్‌వైటీ600 సెన్సార్ కూడా ఉంది. 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ రియర్ కెమెరాను ప్యాక్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16ఎంపీ సెన్సార్ కూడా ఉంది.
ఇతర ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో స్టీరియో స్పీకర్లు, 0809 ఏఏసీ లీనియర్ మోటార్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఇతర ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్‌ల మాదిరిగానే ఈ ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. కొన్ని ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. సింకరైజ్ చేసేందుకు ఏఐ ఆడియో అన్ని ఇమెయిల్‌లను చదివి వినిపిస్తుంది. ఏఐ నోట్ సమ్మరీ, ఏఐ టెక్స్ట్ ట్రాన్సులేట్ కూడా వీటిలో ఉన్నాయి. ఈ ఫోన్ కూడా ఐపీ65 రేటింగ్ అయింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.