Poco M6 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త ఎమ్6 5జీ సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో కొత్త 64జీబీ స్టోరేజీ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ మూడు ర్యామ్, 4జీబీ+128జీబీ, 6జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.
ప్రస్తుతం ఉన్న అన్ని ఆప్షన్లలో కన్నా రాబోయే వేరియంట్ చౌకగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌కి మీడియాటెక్ డైమన్షిటీ 6100 ప్లస్ ఎస్ఓసీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
భారత్‌లో పోకో M6 5జీ, 64జీబీ వేరియంట్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో పోకో M6 5జీ ఫోన్ 4జీబీ+ 64జీబీ వేరియంట్‌లో రూ. 8,999 ధరకు అందిస్తుంది. జూలై 20 నుంచి 12 గంటల (అర్ధరాత్రి) నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది. ఇ-కామర్స్ సైట్‌లోని బ్యానర్ ఈ వివరాలను ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ కొత్త కాన్ఫిగరేషన్ ఎంపిక చేసిన బ్యాంకుల కస్టమర్‌లకు రూ. 1000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టుప్రకారం.. గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ కలర్‌వేస్‌లో వస్తుంది. ప్రస్తుతం 4జీబీ+ 128జీబీ, 6జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ వేరియంట్‌లు వరుసగా రూ. 10,499, రూ. 11,499, రూ. 13,499కు పొందవచ్చు.
పోకో ఎమ్6 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
పోకో ఎమ్6 5జీ 6.74-అంగుళాల హెచ్‌డీ+ (1,600 x 720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 260పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.గ్లాస్ కార్నింగ్ గోర్3 ప్రొటెక్షన్‌తో పాటు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ద్వారా 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో కూడా ఫోన్ షిప్పింగ్ చేయొచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే..
పోకో M6 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ఏఐ సపోర్టుతో ప్రైమరీ సెన్సార్, సెకండరీ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కెమెరా 5ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. పోకో ఎమ్6 5జీ 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.