Prema Vimanam ప్రేమ ,ఆశలు,ఆశయాలు OTT లో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్ఓటీటీ లకు డిమాండ్ పెరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక ఇప్పుడు తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా లభిస్తుంది. దీనితో గత కొన్ని వారాలుగా ఓటీటీ లో కనీసం వారానికి రెండు వారాలకు ఓ తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు.. ఇంకా స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ మధ్య ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న సినిమాలలో ఏ సినిమాలు బావుంటాయి అనే సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే మలయాళ , తమిళ చిత్రాలలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ మూవీ గురించే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథ ఏంటో చూసేద్దాం. ఈ మూవీ అంతా కూడా 90లలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముగ్గురి జీవితాలను పార్లల్ గా చూపిస్తూ ఉంటారు. శాంతమ్మ అనే ఆవిడ తన అత్త , పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తోచిన పని చేసుకుంటూ.. ఉన్న దాన్లోనే పిల్లలలను చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె పిల్లలకు మాత్రం చిన్నపటినుంచి కూడా విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది. దానికోసం తన తల్లిని ఎంత అడిగినా కానీ అది మన వలన కాదని చెప్తూ కాలం వెళ్లబుచ్చుతుంది. మరో వైపు.. అదే ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతూ ఉంటాడు. అతను తన కొడుకు మణిని దుబాయ్ పంపించాలని కలలు కంటూ ఉంటాడు. మణి మాత్రం ఆ ఊరు విడిచి వెళ్ళడానికి ఇష్టపడడు. కారణం ఏంటంటే అతని ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత ను ప్రేమిస్తాడు.
చిన్నప్పటినుంచి మణి, అభిత ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ అభిత తండ్రి మాత్రం ఆమెకు మరొక సంబంధాన్ని ఫిక్స్ చేస్తాడు. దీనితో వీరిద్దరూ ఆ ఊరి నుంచి బయటపడి దుబాయ్ కు పారిపోవాలని డిసైడ్ అవుతారు. మరో వైపు శాంతమ్మ కొడుకులు రామ్ లక్ష్మణ్ విమానం ఎక్కాలనే కోరికతో.. తన తల్లి కష్టపడి సంపాదించిన డబ్బును దొంగలించి హైదరాబాద్ పారిపోతారు. ఇక్కడ మణి, అభితలకు దుబాయ్ కు వెళ్లేందుకు డబ్బులు తక్కువవుతాయి. ఆ డబ్బులను మణి ఎలా సంపాదించాడు ? వారిద్దరూ దుబాయ్ వెళ్ళారా లేదా ? చివరికి కథ ఏమైంది ? రామ్ , లక్ష్మణ్ విమానం ఎక్కారా ? ఊరిలో ఈ విషయాలు తెలిశాయా ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “ప్రేమ విమానం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.