ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఎంతోమందిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తుందన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని విషయాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. దాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు తెలియజేశాయన్నారు.
తెలుగువారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని అంతా ఆశించామని, కానీ కాకపోవడం నిరాశ కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఢిల్లీలోనూ తెలుగువారి నాయకత్వం ఉండేదని.. ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మళ్లీ ఆ అలాంటి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కమ్మసంఘం కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో లిటిగేషన్లు పెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి కూడా సహకరిస్తుందన్నారు.
వీడియో చూడండి..
ఎన్టీఆర్ లైబ్రరీలో తాము చదువుకున్న చదువు ఇవాళ ఉన్నత స్థానాలకు రావటానికి ఉపయోగ పడిందని.. దీనిని గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏ మాత్రం భయపడనంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్జీ రంగా.. వెంకయ్య నాయుడు.. లాంటి నేతల పేర్లను చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ఈ నాడు.. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటూ వివరించారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని.. కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తామంటూ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని.. అది తమ ప్రభుత్వ విధానం కాదంటూ స్పష్టంచేశారు.
వీడియో చూడండి..
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.