క్రికెట్‌లో రికార్డులు క్రియేట్ అవుతుంటాయి.. కాలం గడిచే కొద్ది అవి బ్రేక్ అయి సరికొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి. కానీ, తొలిసారి ఓ రికార్డును నమోదు చేయడం మాత్రం ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుంటుంది. వన్డేల్లో చాలా మంది డబుల్ సెంచరీలో కొట్టారు.. కానీ, ఫస్ట్ డబుల్ సెంచరీ అనగానే క్రికెట్ దేవుడ్ సచిన్ టెండూల్కర్ గుర్తుకు వస్తాడు. అలాగే వంద సెంచరీలను భవిష్యత్తులో ఎవరైనా దాటినా కూడా వంద సెంచరీలు అనగానే గుర్తుకు వచ్చే పేరు కూడా ధోనినే. అలాగే టెస్టులు ట్రిపుల్ సెంచరీ అనగానే మనకు వీరేందర్ సెహ్వాగ్ గుర్తుకు వస్తాడు. అలాగే ఉమెన్స్ క్రికెట్‌లో ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ ఎవరంటే.. ఇకపై లేడీ ధోనిగా పేరొందిన రీచా ఘోష్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఉమెన్స్ ఆసియా కప్ 2024లో భాగంగా ఆదివారం యూఏఈతో మ్యాచ్ సందర్భంగా రీచా హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అయితే.. ఉమెన్స్ ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ వికెట్ కీపర్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. అలా చేసిన మొట్టమొదటి క్రికెటర్ రీచా ఘోష్‌నే. అయితే.. ఈ మ్యాచ్‌లో రీచాతో పాటు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం హాఫ్ సెంచరీతో రాణించింది. 47 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేసి అదరగొట్టింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేసింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రీచా ఘోష్ హాఫ్ సెంచరీలతో రాణించి, భారత్‌కు భారీ స్కోర్ అందించారు. ఇక 202 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ ఇషా రోహిత్ 38, కావిషా 40 పరుగులతో రాణించినా.. జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లతో రాణించింది. మరి ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చరిత్ర సృష్టించిన రీచా ఘోష్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Richa Ghosh – the first Indian wicketkeeper in Women’s Asia Cup history to score a fifty. 🫡 pic.twitter.com/vmztGLU0Tn
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.