SIM Subscription Fraud : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) డేటా సైన్స్ ఇనిస్టిట్యూట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సంయుక్తంగా ‘టెలికాం సిమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రాడ్స్.. గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ అసెస్‌మెంట్స్ అండ్ రికమెండేషన్స్’ అనే అధ్యయనాన్ని చేపట్టింది.
సిమ్ కార్డ్ మోసం రోజువారీ సైబర్ నేరాలలో ముఖ్యమైనది. సిమ్ కార్డులు ఇచ్చే ముందు గుర్తింపు అవసరం ఉందని సూచిస్తుంది. ఈ నివేదిక సిమ్ కార్డ్ సబ్‌స్క్రిప్షన్ మోసాన్ని తగ్గించడానికి పరిష్కారాలను అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని టెలికాం మోసాలలో 35శాతం నుంచి 40శాతం వరకు సిమ్ కార్డ్ మోసాలే ఉంటాయని, టెలికాం రంగానికి సంవత్సరానికి రూ.3,600 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని ఈ అధ్యయనం సూచిస్తుంది.
SIM Subscription Fraud
SIM Subscription Fraud రిపోర్టును ఐఎస్‌బీ ప్రొఫెసర్ మనీష్ గంగవార్, డాక్టర్ శృతి మంత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ (ఐఐడీఎస్), తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు స్టీఫెన్ రవీంద్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆపరేషన్స్ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్), కలమేశ్వర్ శింగేనవర్, పోలీస్ కమిషనర్, నిజామాబాద్, రిథిరాజ్ ఐ జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, నేతృత్వంలోని ఐఎస్‌బీ బృందం సంయుక్తంగా రచించారు.
SIM Subscription Fraud అధ్యయనంలో అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో స్టోర్ చేసిన కస్టమర్ అక్విజిషన్ ఫారమ్స్ (CAFs) నుంచి సబ్‌స్క్రైబర్ డేటాను ఉపయోగించారు.
హైదరాబాద్, తెలంగాణ అంతటా రిపోర్టు చేసిన నేరస్థులకు చెందిన ఫోన్ నంబర్లు, వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి 1,600 సీఎఎఫ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) మోడళ్లను ఉపయోగించి ఈ పీడీఎఫ్ రూపంలో ఉన్న సీఐఎఫ్ నుంచి డేటా రియల్-టైం విశ్లేషణ అందించింది. అంతర్జాతీయంగా ఉన్న బెస్ట్ పద్ధతుల కోసం 160 దేశాలలో సిమ్ రిజిస్ట్రేషన్ విధానాలపై విస్తృత విశ్లేషణ చేసింది.
SIM Subscription Fraud అధ్యయనం ప్రకారం.. 64.5శాతం మంది భారతీయ యూజర్లు సిమ్ రిజిస్ట్రేషన్‌కు డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్)పై ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ ఆధార్ ఐడీనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ నంబర్లలో 89శాతం ఆధార్‌కు లింక్ చేయలేదు.
వెరిఫైడ్ ప్రక్రియలలో ఈ లోపాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ లోపాలను ఎత్తిచూపుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్లచే అక్రమ పద్ధతులను గుర్తించింది. ఈ అధ్యయనంలో రియల్ టైం సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్, ప్రభావం చూపని ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ లోపాలను కూడా సూచించింది. వెరిఫికేషన్ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ నంబర్లు తరచుగా ఇతర నేరస్థులకు లింక్ చేసినట్టుగా గుర్తించారు.
అధ్యయనం ఇతర ఫలితాలివే :
SIM Subscription Fraud డేటా విశ్లేషణ ప్రకారం.. సైబర్ మోసగాళ్లు ఫేక్ ఆధార్ కార్డులను పిల్లల ఫొటోలను ఉపయోగించి దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు తప్పుడు సిమ్ కార్డులను పొందుతున్నారు. ఫేక్ ఆధార్ కార్డులతో దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు తప్పుడు సిమ్ కార్డులను పొందుతున్నారు.
మల్టీ-లేయర్డ్, రిస్క్-ఆధారిత విధానంపై అధ్యయనం ఆన్‌లైన్ ఐడెంటిఫికేషన్, వెరిఫైడ్ మెథడ్స్ చేర్చడం, ఎలక్ట్రానిక్ గుర్తింపు ప్రక్రియలను మెరుగుపరచడం, సిమ్ సబ్‌స్క్రిప్షన్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులకు సరైన విద్య అవసరం. ఈ అధ్యాయనం చట్టబద్ధమైన కస్టమర్ కేవైసీ వివరాలతో మోసపూరిత కార్యకలాపాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలను తగ్గిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర పోలీసులు, ఐఎస్బీ చేసిన ఈ అధ్యయనం సిమ్ కార్డ్ మోసానికి సంబంధించిన ప్రధాన సమస్యలను వెలుగులోకి తెచ్చిందన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదని, కోల్పోయిన లేదా దొంగిలించిన సిమ్ కార్డులను వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెరిఫైడ్ ఏజెంట్లతో మాత్రమే వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ డిజిటల్ యుగంలో భద్రత అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.