బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రార్థించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తున్నారు. సొంతంగా ‘సోనూ ఫౌండేషన్’ స్థాపించి అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. అలా తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు సోనూ సూద్. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని ‘నా చదువుకు హెల్ప్ చేయండి సార్’ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.
ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన మాదిగ దేవీ కుమారి అనే అమ్మాయి బీఎస్ సీ చదవాలనుకుంటోంది. అయితే కటిక పేదరికం ఆమె చదువుకు అడ్డు పడుతోంది. దీంతో ‘ నా చదువుకు హెల్ప్ చేయండి సార్’ అంటూ అందరినీ వేడుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవీ కుమారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు తల్లి.. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండూ’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోనూ సోద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సోనూసూద్ రియల్ హీరో’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
సోనూ సూద్ రిప్లై ఇదిగో..
I will make sure she gets admission in a college of her choice 🤍👍 https://t.co/uIwQkVwW1M
— sonu sood (@SonuSood) July 19, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఫతేహా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించనున్నాడు.
భారీ వర్షంలోనూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోన్న రియల్ హీరో సోనూసూద్..
విద్యార్థులతో సోనూసూద్..
Was such a pleasure meeting these talented kids from Uttrakhand who were rewarded with a holiday to Mumbai, for their academic excellence .Boarding an aircraft for the first time is always a special experience and I was delighted to share some happy moments with them. Always… pic.twitter.com/MdNhSxefx4
— sonu sood (@SonuSood) July 16, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.