Soundarya – Krishna Vamsi : డైరెక్టర్ కృష్ణవంశీ ఎన్నో క్లాసిక్ సినిమాలను తెలువాళ్ళకు అందించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాఒకప్పుడు ఎన్నో హిట్ ఫిలిమ్స్ ఇచ్చారు. కృష్ణవంశీ సినిమాల్లో మహేష్ బాబు మురారి సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ ట్విట్టర్లో నెటిజన్లతో ముచ్చటించాడు. నెటిజన్లు, మహేష్ అభిమానులు మురారి, వేరే సినిమాల గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అంతఃపురం సినిమాలోని పాట గురించి అడిగాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్.. ముఖ్య పాత్రల్లో రా అండ్ రస్టిక్ గా అంతఃపురం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా క్లాసిక్ సినిమాల లిస్ట్ లో నిలిచింది. ఈ సినిమాలోని ‘అసలేం గుర్తుకురాదు..’ సాంగ్ పెద్ద హిట్ అని తెలిసిందే. ఈ సాంగ్ లో సౌందర్య రెడ్ చీర కట్టుకొని ఉంటుంది. అయితే పాట మధ్యలో సౌందర్య చీర కలర్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇప్పుడు ఈ పాట చూసిన వాళ్లందరికీ అప్పట్లో ఈ కలర్ ఛేంజింగ్ ఎలా చేశారు అని సందేహం వస్తుంది.
ఓ నెటిజన్ ఇదే సందేహాన్ని కృష్ణవంశీని అడిగాడు. సౌందర్య చీర కలర్స్ మార్చడం అప్పట్లో కొత్త ఐడియా. అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది అని అడిగారు. దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. సినిమాలో అలా ఉండదు అండి. రిలీజ్ తర్వాత జెమినీ టీవీ ఛానల్ లో ఎడిటర్ చేంజ్ చేసాడు అలా అని తెలిపారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు మనం అది కొత్త ప్రయోగం డైరెక్టర్ చేసాడు అనుకున్నాం కానీ ఛానల్ టెలికాస్ట్ లో ఎడిటర్ చేశాడా అని షాక్ అవుతున్నారు. ఒరిజినల్ వర్షన్ లో కేవలం రెడ్ శారీతో మాత్రమే సాంగ్ ఉంటుంది.
Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. , THQ https://t.co/gLLNeZNE6n
— Krishna Vamsi (@director_kv) July 20, 2024
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.