మీరు నరాల సమస్యల నుండి బయటపడటానికి స్టార్ సోంపు నీటిని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి ఒక గ్లాసు నీటిలో 1 నుండి 2 స్టార్ సోంపు వేసి, సుమారు 10 నిమిషాలు మరిగించాలి.. ఆ తర్వాత వడకట్టి తేనె వేసుకుని తాగేయాలి.. ఇది నరాల వాపు, బలహీనత నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నరాల బలహీనత నుండి ఉపశమనం పొందడానికి స్టార్ సోంపును పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, మొదట 50 గ్రాముల నుండి 100 గ్రాముల స్టార్ సోంపు తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీ సాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సలాడ్లు, పప్పులు, కూరగాయలు మొదలైన వాటిపై చల్లుకుని వాడుకొవచ్చు.
నరాల సమస్యల నుండి బయటపడటానికి మీరు తేనెతో పాటు స్టార్ సోంపును ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి, 1 చెంచా తేనెను తీసుకుని అందులో స్టార్ సోంపు పొడిని కలిపి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది. శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు..స్టార్ సోంపు టీతో జలుబు, ఫ్లూ, గొంతునొప్పి అన్నింటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు, స్టార్ సోంపులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి సహజంగా విషాన్ని తొలగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఇది గొంతుకు సంక్రమించే సూక్ష్మక్రిములను తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను చూపించింది.
చచ్చుబడిపోయిన నరాలకు ప్రాణం పోయడానికి స్టార్ సోంపును ఉపయోగించడం చాలా ఆరోగ్యకరమైనది. అయితే, సమస్య మరింత తీవ్రంగా ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.