Sunita Williams Plants trees at Universe : నాసా యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ కింద తన భాగస్వామి బుచ్ విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. ఇకపోతే తాజాగా విలియమ్స్ అంతరిక్షంలో మట్టి లేకుండా మొక్కలను పెంచడంలో విల్మోర్ తో కలిసి పని చేస్తున్నట్లు కనపడుతుంది. మైక్రోగ్రావిటీలో మొక్కలకు నీరు పెట్టే మార్గాలను పరీక్షిస్తూ ఆమె సమయాన్ని గడిపింది. విలియమ్స్ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వివిధ ద్రవ ప్రవాహ పద్ధతులను పరీక్షించారు.
విలియమ్స్ హైడ్రోపోనిక్స్, గాలిని ఉపయోగించి అదనపు పరీక్షలు నిర్వహించారు. అంతరిక్ష నౌక, అంతరిక్ష ఆవాసాలలో వివిధ రకాల మొక్కలను ఎలా సమర్థవంతంగా పోషించాలో చూపించారు. వ్యోమగాములు ఇద్దరూ నిర్వహించిన ఈ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ అధ్యయనం బరువులేని వాతావరణంలో మొక్కలకు నీరు పెట్టే పద్ధతులను అన్వేషించడం లక్ష్యంగా ఉంది. విలియమ్స్, విల్మోర్ కూడా ఈ మొత్తం పరీక్ష వీడియోను రూపొందించారు.
స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ప్రస్తుతం అందులో చిక్కుకుపోయారు. అంతా మిషన్ ప్లాన్ ప్రకారం జరిగిఉంటే.. జూన్ 14న అంతరిక్ష నౌకను వదిలి ఇక్కడికి రావలిసి ఉండేది. అయితే, మొదట్లో హీలియం లీక్ కారణంగా సాంకేతిక లోపంతో వాయిదా పడింది. ఆ తర్వాత దాని థ్రస్టర్ లతో సమస్య ఏర్పడింది. దాంతో వారి ప్రయాణం మరోసారి వాయిదా పడింది. దింతో ఇద్దరు వ్యోమగాములు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.