Suspected Death Recall: గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత అనుమానాస్పద మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై, ఓ పక్కన బాధితులు మరో పక్కన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తె జననిని 2022లో బండారు ఆనంద్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని, నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పటి సీఐ తమపైనే హత్య కేసు నమోదు చేశారని యువతి తల్లి హోంమంత్రి ఎదుట వాపోయారు. అప్పట్లో జరిగిన అన్యాయాన్ని, వెలికి తీసేందుకు కేసును రీ కాల్ చేయాలని, హోంమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తమ బిడ్డను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితులపై, హత్యా నేరం మోపడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు హోం మంత్రి అనిత. ఈ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని ఆదేశించారు.
అసలు జననీ మృతి కేసులో ఏం జరిగింది ?
2022లో జనని, సాతులూరుకు చెందిన ఆటోడ్రైవర్ ఆనంద్‌లు వివాహం చేసుకున్నారు. జనని, ఆనంద్ ల వివాహం అనంతరం చెన్నైలో కొద్ది రోజులు కాపురం పెట్టారు. నాలుగు నెలల అనంతరం జనని,ఆనంద్‌లు గుంటూరుకు కాపురం మార్చారు. జనని కుటుంబ సభ్యులతో ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా అత్తింటి వారు చేసినట్లు తెలిసింది. ఇంతలోనే జనని గర్భం దాల్చింది. జననీకి 9 నెలల గర్భం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 14న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు జనని భర్త ఆనంద్ తీసుకెళ్లాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లాడు. సెప్టెంబర్ 17న జనని అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా, జనని మృతిపై అనుమానాలు ఉన్నాయని అదే నెల 28న జిల్లా కలెక్టర్‌ను కలిసి యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో తల్లిదండ్రుల ఆవేదన విన్న హోంమంత్రి అనిత కేసును రీకాల్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.